Prabhas: పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ కేవలం ఒకే ఏడాది వ్యవధిలో మూడు భారీ సినిమాలతో బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ లైనప్‌లో మొదటగా ‘ఫౌజీ’ ఈ ఏడాది డిసెంబర్‌లో వచ్చే ఛాన్స్ ఉండగా.. సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ మార్చి 2027 లో, మరియు మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘కల్కి 2’ డిసెంబర్ 2027 లో రిలీజ్ అయ్యేలా ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి ఊహాగానాలు నడుస్తున్నాయి.
మరింత Prabhas: ప్రభాస్ బాక్సాఫీస్ దండయాత్ర.. ఒక్క ఏడాదిలోనే 3 సినిమాలు రిలీజ..?Blog
Revanth Reddy: రూ.600 కోట్ల టెండర్లలో రూ.3 వేల కోట్ల అవినీతా?.. ఉన్నత చదువులు చదివిన మేధావులపై సీఎం రేవంత్ ఫైర్!
Revanth Reddy: రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి, విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆడారు. విద్యాశాఖకు ప్రభుత్వం రూ.27 వేల కోట్లు ఖర్చు చేస్తోందని చెప్తూ.. కులాల వారీగా హాస్టళ్ల కంటే అందరూ కలిసి చదివే టీపీఎస్ విధానమే సరైందని పేర్కొన్నారు. 1800 మందితో ఆరుట్ల స్కూల్ ‘నో వేకెన్సీ’ స్థాయికి చేరిందని, 2034 నాటికి ఇక్కడి పిల్లలు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ సాధించేలా ట్రైనింగ్ ఇస్తామన్నారు. అలాగే ఉప్పల్ స్టేడియం టెండర్లపై వస్తున్న అవినీతి ఆరోపణలను సీఎం తిప్పికొట్టారు.
మరింత Revanth Reddy: రూ.600 కోట్ల టెండర్లలో రూ.3 వేల కోట్ల అవినీతా?.. ఉన్నత చదువులు చదివిన మేధావులపై సీఎం రేవంత్ ఫైర్!Tulasi: ఇంట్లో తులసి మొక్క ఎండిపోతోందా? వాస్తు ప్రకారం అది శుభమా.. అశుభమా?
Tulasi: హిందూ ధర్మంలో తులసిని లక్ష్మీస్వరూపంగా పూజిస్తారు. ఇంట్లో తులసి మొక్క ఎండిపోవడం అశుభం మరియు ఇది ఆర్థిక, కుటుంబ సమస్యలకు సంకేతం. ఎండిపోయిన తులసిని చెత్తలో వేయకుండా నదిలో నిమజ్జనం చేయాలి లేదా మట్టిలో పూడ్చాలి. అనంతరం గురు లేదా శుక్రవారాల్లో ఉత్తర, తూర్పు దిశల్లో కొత్త మొక్కను నాటాలి. అలాగే ఆదివారం, ఏకాదశి రోజుల్లో తులసికి నీరు పోయకూడదు.
మరింత Tulasi: ఇంట్లో తులసి మొక్క ఎండిపోతోందా? వాస్తు ప్రకారం అది శుభమా.. అశుభమా?Pawan Kalyan: ‘చోటా గబ్బర్ సింగ్’ ఇంటికి వచ్చి పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం
Pawan Kalyan: అరుదైన ‘డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ’ వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల అభిమాని నిరంజన్‌ను పరామర్శించడానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హన్మకొండలోని ఆయన నివాసానికి స్వయంగా వచ్చారు. సామాజిక కార్యకర్త చిలువేరు శంకర్ ద్వారా బాబు పరిస్థితి తెలుసుకున్న పవన్.. నిరంజన్ ఇంట 45 నిమిషాలు గడిపి, ధైర్యం చెప్పారు. పవన్ రాకతో ఆ బాలుడి చివరి కోరిక నెరవేరింది.
మరింత Pawan Kalyan: ‘చోటా గబ్బర్ సింగ్’ ఇంటికి వచ్చి పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎంTelangana Public School: మొదటి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. రూ.15 కోట్లతో అంతర్జాతీయ హంగులు!
Telangana Public School: రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రాష్ట్రంలోనే మొదటి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి, పైలాన్ ఆవిష్కరించారు. రూ.15 కోట్ల ప్రభుత్వ నిధులతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ పాఠశాలలో విద్యార్థులతో కలిసి సీఎం బ్రేక్‌ఫాస్ట్ చేశారు. అనంతరం పేరెంట్స్ కమిటీ సభ్యులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, కాసేపట్లో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
మరింత Telangana Public School: మొదటి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. రూ.15 కోట్లతో అంతర్జాతీయ హంగులు!LPG e-KYC: ఈ నెలాఖరులోగా ‘ఈ-కేవైసీ’ పూర్తి చేయాల్సిందే.. !
LPG e-KYC: ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులు తమ గ్యాస్ కనెక్షన్ ఈ-కేవైసీని జూన్ 30 లోగా పూర్తి చేయాలని పౌరసరఫరాల శాఖ ఆదేశించింది. రాయితీ దుర్వినియోగం కాకుండా ఉండటానికి తెచ్చిన ఈ విధానాన్ని ఆయిల్ కంపెనీల యాప్స్, డెలివరీ బాయ్స్ లేదా గ్యాస్ ఏజెన్సీల వద్ద పూర్తి చేసుకోవచ్చు. అయితే, ఈ-కేవైసీ కాలేదనే కారణంతో గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్ బుకింగ్‌లను ఆపకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.
మరింత LPG e-KYC: ఈ నెలాఖరులోగా ‘ఈ-కేవైసీ’ పూర్తి చేయాల్సిందే.. !Kishan Reddy: మెట్రో రైలుపై బురదజల్లడం ఆపండి.. మేము సీఎంకు కాదు, ప్రజలకే జవాబుదారీ!
Kishan Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మెట్రో ఫేజ్-1కు కేంద్రం రూ.1200 కోట్లు ఇచ్చిందని చెప్తూ.. మెట్రోపై బురదజల్లే ప్రయత్నం సరికాదన్నారు. తాము రేవంత్‌కు కాకుండా తెలంగాణ ప్రజలకు జవాబుదారీ అని స్పష్టం చేశారు. రూ.13 వేల కోట్ల IRFC లోన్ పెండింగ్‌కు పలు కారణాలు ఉన్నాయని, దీనిపై కేంద్ర, రాష్ట్ర అధికారులు కలిసి చర్చించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.
మరింత Kishan Reddy: మెట్రో రైలుపై బురదజల్లడం ఆపండి.. మేము సీఎంకు కాదు, ప్రజలకే జవాబుదారీ!Pawan Kalyan: ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ‘సూపర్ హిట్’ టూర్.. ఏపీ అటవీ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!
Pawan Kalyan: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌తో భేటీ అయి 7 కీలక ప్రతిపాదనలకు ఆమోదం సాధించారు. ఏనుగుల దాడి నివారణకు ‘హనుమాన్ సెంటర్’, టైగర్ రిజర్వ్ రక్షణకు 150 బేస్ క్యాంప్‌లు, 300 మంది చెంచు యువతకు ఉద్యోగాలు, ఎంపీ మరియు మహారాష్ట్రల నుండి 50 బోదెద్దులు, 6 పులుల తరలింపునకు అనుమతులు లభించాయి. అలాగే కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, సీఆర్ పాటిల్‌లను కలిసి ఉపాధి హామీ నిధులు, గోదావరి ప్రక్షాళన, సూరత్ నీటి నిర్వహణ నమూనా అమలుపై చర్చించారు.
మరింత Pawan Kalyan: ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ‘సూపర్ హిట్’ టూర్.. ఏపీ అటవీ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!Chandrababu: సింగపూర్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు నాయుడు ‘ఏఐ & అమరావతి’ రోడ్‌మ్యాప్..!
Chandrababu: సింగపూర్ ‘వరల్డ్ సిటీస్ సమ్మిట్’లో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి విజన్‌ను ప్రకటించారు. నాడు సైబరాబాద్‌లో ఎకరం రూ.2 లక్షల నుండి నేడు రూ.200 కోట్లకు పెరగడమే సంపద సృష్టికి నిదర్శనమన్నారు. ఒకే పిలుపుతో 35 వేల ఎకరాలిచ్చిన అమరావతి రైతులను అభినందిస్తూ.. 21 కి.మీ వాటర్ ఫ్రంట్, క్వాంటం కంప్యూటింగ్ హబ్, నెట్ జీరో లక్ష్యాలతో అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మిస్తున్నామని తెలిపి, పెట్టుబడిదారులను ఆహ్వానించారు.
మరింత Chandrababu: సింగపూర్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు నాయుడు ‘ఏఐ & అమరావతి’ రోడ్‌మ్యాప్..!Nani-Sujeeth: ‘బ్లడీ రోమియో’ క్రేజీ అప్‌డేట్.. 80% షూటింగ్ అక్కడే!
Nani-Sujeeth: నాని-సుజీత్ సినిమా కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అభిమానులకు ఓ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సుజీత్ అండ్ టీమ్ ఈ సినిమా కోసం లండన్‌లో లొకేషన్స్ కోసం తిరుగుతూ ఫుల్ బిజీగా ఉన్నారు.
మరింత Nani-Sujeeth: ‘బ్లడీ రోమియో’ క్రేజీ అప్‌డేట్.. 80% షూటింగ్ అక్కడే!