Nani-Sujeeth: నాని-సుజీత్ సినిమా కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అభిమానులకు ఓ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సుజీత్ అండ్ టీమ్ ఈ సినిమా కోసం లండన్‌లో లొకేషన్స్ కోసం తిరుగుతూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక షూటింగ్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది.
పవన్ కళ్యాణ్ తో సుజీత్ తీసిన OG సినిమా బ్లాక్ బస్టర్ కావడమే కాకుండా నానితో తీస్తున్న బ్లడీ రోమియో కూడా సుజీత్ యూనివర్స్ లోని సినిమా కావడంతో ఈ సినిమాపైన ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. బ్లడీ రోమియో సినిమా మొత్తం ఫారిన్లోనే జరిగే కథ అని తెలుస్తుంది. లండన్, బుడాపెస్ట్, హంగేరీలలో మాగ్జిమమ్ షూట్ లొకేషన్స్ కోసం తిరుగుతున్న సుజీత్.. ఈ సినిమా హైదరాబాద్‌లో 20% మాత్రమే షూటింగ్ జరగనుంది, మిగిలిన మొత్తం ఫారిన్లో జరగనుంది.
ఇంకో పక్క నాని, శ్రీకాంత్ ఓదెలతో కలిసి ప్యారడైజ్ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగష్టు 21న రిలీజ్ కావాల్సి ఉండగా.. షూటింగ్ లేట్ అవ్వడం వల్ల ఇంకోసారి సినిమా పోస్ట్‌పోన్ అయ్యి డిసెంబర్ లేదా నెక్స్ట్ ఇయర్ కి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది.
