Chandrababu: సింగపూర్ ‘వరల్డ్ సిటీస్ సమ్మిట్’లో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి విజన్‌ను ప్రకటించారు. నాడు సైబరాబాద్‌లో ఎకరం రూ.2 లక్షల నుండి నేడు రూ.200 కోట్లకు పెరగడమే సంపద సృష్టికి నిదర్శనమన్నారు. ఒకే పిలుపుతో 35 వేల ఎకరాలిచ్చిన అమరావతి రైతులను అభినందిస్తూ.. 21 కి.మీ వాటర్ ఫ్రంట్, క్వాంటం కంప్యూటింగ్ హబ్, నెట్ జీరో లక్ష్యాలతో అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మిస్తున్నామని తెలిపి, పెట్టుబడిదారులను ఆహ్వానించారు.
మరింత Chandrababu: సింగపూర్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు నాయుడు ‘ఏఐ & అమరావతి’ రోడ్‌మ్యాప్..!Blog
Nani-Sujeeth: ‘బ్లడీ రోమియో’ క్రేజీ అప్‌డేట్.. 80% షూటింగ్ అక్కడే!
Nani-Sujeeth: నాని-సుజీత్ సినిమా కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అభిమానులకు ఓ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సుజీత్ అండ్ టీమ్ ఈ సినిమా కోసం లండన్‌లో లొకేషన్స్ కోసం తిరుగుతూ ఫుల్ బిజీగా ఉన్నారు.
మరింత Nani-Sujeeth: ‘బ్లడీ రోమియో’ క్రేజీ అప్‌డేట్.. 80% షూటింగ్ అక్కడే!CM Vijay: సీఎం విజయ్ దసరా కానుక.. 14 లక్షల మంది రైతులకు బంపర్ బెనిఫిట్!
CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ సహకార బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ నిబంధనలు సవరిస్తూ గుడ్ న్యూస్ చెప్పారు. రూ.75,000 వరకు అప్పు ఉన్న సన్న, చిన్న, పెద్ద రైతులకు పూర్తి రుణమాఫీ చేయనుండగా.. అంతకంటే ఎక్కువ ఉన్న వారికి రూ.35,000 చొప్పున మాఫీ చేయనున్నారు. రైతుల నిరసనలతో సచివాలయంలో జరిగిన సమీక్షలో ఈ మార్పులు చేశారు. దీనివల్ల 14.43 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుండగా, ప్రభుత్వంపై రూ.5,932 కోట్ల అదనపు భారం పడనుంది.
మరింత CM Vijay: సీఎం విజయ్ దసరా కానుక.. 14 లక్షల మంది రైతులకు బంపర్ బెనిఫిట్!ACB Raids: ల్యాండ్ అండ్ సర్వే డీడీ నరహరి ఇళ్లపై మెరుపు దాడులు.. ఒకేసారి 12 ప్రాంతాల్లో సోదాలు!
ACB Raids: హైదరాబాద్‌లో ల్యాండ్ అండ్ సర్వే విభాగం డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇళ్లపై ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం భారీ సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఛత్రినాకలోని ఆయన ఇల్లు, కార్యాలయం సహా 10 ప్రాంతాల్లో ఇద్దరు డీఎస్పీల ఆధ్వర్యంలో 10 బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నాయి. ఈ తనిఖీల్లో భారీగా బంగారం, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మరింత ACB Raids: ల్యాండ్ అండ్ సర్వే డీడీ నరహరి ఇళ్లపై మెరుపు దాడులు.. ఒకేసారి 12 ప్రాంతాల్లో సోదాలు!Surya: స్పీడ్ పెంచిన సూర్య.. ఐదుగురు టాప్ డైరెక్టర్లతో సినిమాలు..!
Surya: సూర్య నటించిన ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఆయన తదుపరి చిత్రాలపై అంచనాలు పెరిగాయి. వెంకీ అట్లూరితో వస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చివరి దశకు చేరగా, ‘ఆవేశం’ దర్శకుడు మరియు ‘జై భీమ్’ ఫేమ్ జ్ఞానవేల్‌తో సినిమాలు లైన్లో ఉన్నాయి. హెచ్. వినోద్‌తో పాటు సూర్య కెరీర్ లోని ప్రతిష్టాత్మక 50వ చిత్రాన్ని నెల్సన్ డైరెక్ట్ చేసే అవకాశం ఉందని కోలీవుడ్ మీడియా పేర్కొంది.
మరింత Surya: స్పీడ్ పెంచిన సూర్య.. ఐదుగురు టాప్ డైరెక్టర్లతో సినిమాలు..!K.S. Viswanathan: ఏ.పి. ఫిలిం, టెలివిజన్ మరియు నాటకరంగ అభివృద్ది సంస్థ తొలి డైరెక్టర్ల సమావేశం
K.S. Viswanathan: రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించే దిశగా ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన పాలకవర్గం తొలి బోర్డు సమావేశం సోమవారం విజయవాడ ఫార్చూన్ మురళి పార్క్ హోటల్‌లో విజయవంతంగా నిర్వహించామని మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్. విశ్వనాథన్ తెలిపారు.
మరింత K.S. Viswanathan: ఏ.పి. ఫిలిం, టెలివిజన్ మరియు నాటకరంగ అభివృద్ది సంస్థ తొలి డైరెక్టర్ల సమావేశంTG Public School: రేపు తొలి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
TG Public School: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో రాష్ట్రంలోనే మొదటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ సిద్ధమైంది. ఐదు ఎకరాల విస్తీర్ణంలో, కార్పొరేట్ ప్రమాణాలతో ప్రీ-ప్రైమరీ నుండి ఇంటర్ వరకు నిర్మించిన ఈ మోడల్ స్కూల్‌ను రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ల్యాబ్‌లు, క్రీడా మైదానాన్ని పరిశీలించనున్న సీఎం.. విద్యార్థుల కోసం అల్పాహార పథకాన్ని ప్రారంభించి అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
మరింత TG Public School: రేపు తొలి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!Pawan Kalyan: మోడీకి అందుకే మద్దతిస్తున్న.. భద్రత లేని జీవితాలు వృధా
Pawan Kalyan: ముంబై 26/11 దాడుల సమయంలో దేశానికి ఒక బలమైన నాయకుడు కావాలని వారణాసిలో తన తండ్రి అస్తికలు నిమజ్జనం చేసేటప్పుడు కాశీ విశ్వనాథుడిని మొక్కుకున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు ఒక గొప్ప నాయకుడిని పుట్టించే శక్తి భారతదేశానికి ఉందన్న నాని పాల్కీవాలా మాటలను గుర్తుచేస్తూ.. కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షల రూపమే నరేంద్ర మోదీ అని చెప్పారు. అభివృద్ధి కంటే దేశ భద్రతే ముఖ్యమని, అందుకే తమ సదస్సులో మోదీని అభినందిస్తూ మొదటి తీర్మానం పెట్టామని స్పష్టం చేశారు.
మరింత Pawan Kalyan: మోడీకి అందుకే మద్దతిస్తున్న.. భద్రత లేని జీవితాలు వృధాNEET Re-Exam: దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ బ్యాన్.. నీట్ ఎక్సమ్ టైమింగ్ పెంపు
NEET Re-Exam: ఈ నెల 21న జరిగే నీట్ రీ-ఎగ్జామ్ భద్రతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జూన్ 22 వరకు దేశంలో టెలిగ్రామ్ యాప్‌ను తాత్కాలికంగా నిషేధించింది. అలాగే జూన్ 30 వరకు టెలిగ్రామ్ ఎడిట్ ఆప్షన్‌ను కూడా తొలగించింది. మరోవైపు ఎన్టీఏ పరీక్ష సమయాన్ని 180 నిమిషాల నుండి 195 నిమిషాలకు పెంచింది. పేపర్ లీక్ అవ్వకుండా ఉండేందుకు దేశంలోనే తొలిసారిగా ప్రశ్నాపత్రాల తరలింపునకు విమానాలను ఉపయోగించారు.
మరింత NEET Re-Exam: దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ బ్యాన్.. నీట్ ఎక్సమ్ టైమింగ్ పెంపుIND-A vs SL-A: తిలక్ వర్మ పొరపాటు వలె.. చిత్తుగా ఓడిపోయిన భారత్
IND-A vs SL-A: శ్రీలంక ‘ఎ’తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా ‘ఎ’ సూపర్ ఓవర్‌లో ఓడిపోయింది. మెయిన్ మ్యాచ్‌లో విప్రజ్ నిగమ్ పిచ్‌పై తప్పుగా పరుగెత్తడం వల్ల లంకకు 10 పెనాల్టీ రన్స్ రావడం, సూపర్ ఓవర్‌లో రుతురాజ్, తిలక్ కాకుండా సూర్యాంశ్ షెడ్గేను బ్యాటింగ్‌కు పంపి స్ట్రైక్ ఇవ్వడంలో జరిగిన వ్యూహాత్మక లోపాలే భారత్ ఓటమికి కారణమయ్యాయి.
మరింత IND-A vs SL-A: తిలక్ వర్మ పొరపాటు వలె.. చిత్తుగా ఓడిపోయిన భారత్