Anirudh And Kavya

Anirudh And Kavya: స్పెయిన్‌లో అనిరుధ్ – కావ్య మారన్ పెళ్లి ?

Anirudh And Kavya: సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ కావ్య మారన్ ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్పెయిన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం కావ్య మారన్ ఒక రిసార్ట్‌ను కూడా ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, వీరిద్దరి నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

మరింత Anirudh And Kavya: స్పెయిన్‌లో అనిరుధ్ – కావ్య మారన్ పెళ్లి ?
Chandrababu

Chandrababu: తల్లి, చెల్లికి న్యాయం చేయలేనివారు.. ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు?

Chandrababu: యాదమర్రి ప్రజావేదికలో సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. జూలై నుండి ఇంటి వద్దకే 74 రకాల పరీక్షలు అందించే ‘సంజీవని’ పథకం, భవిష్యత్తులో ‘ఏఐ డాక్టర్’ సేవలను ప్రకటించారు. ఎన్టీఆర్ ఆరోగ్య పథకం కింద రూ.25 లక్షల ఉచిత వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. కర్నూలులో దేశంలోనే అతిపెద్ద బంగారు గని రాబోతుందన్నారు. అలాగే సొంత తల్లి, చెల్లికి ఆస్తులు ఇవ్వకుండా వేధించిన గొడ్డలి పార్టీకి (వైసీపీ) ప్రజాస్వామ్యంలో చోటు లేదని విమర్శించారు.

మరింత Chandrababu: తల్లి, చెల్లికి న్యాయం చేయలేనివారు.. ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు?
Health Tips:

Health Tips: ఒక పని నుండి మరో పనికి మారినప్పుడు మీ మైండ్ బ్లాక్ అవుతోందా?

Health Tips: ఒక పని నుండి మరో పనికి మారినప్పుడు మెదడు పాత ఆలోచనల్లోనే ఉండిపోవడానికి గల కారణాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మెదడులోని ‘లోకస్ కోరులియస్’ అనే చిన్న భాగం ఆలోచనలను స్విచ్ చేయడానికి (కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ) సహాయపడుతుంది. ఇది లోపిస్తే ఏడీహెచ్‌డీ (ADHD), డిప్రెషన్, అల్జీమర్స్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

మరింత Health Tips: ఒక పని నుండి మరో పనికి మారినప్పుడు మీ మైండ్ బ్లాక్ అవుతోందా?
Hit And Run

Hit And Run: కారుతో ఢీకొట్టి ప్రముఖ న్యాయవాది హత్య.. భూవివాదమే కారణమా?

Hit And Run: హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లో ప్రముఖ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్‌పై శనివారం ఉదయం కారుతో దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వక్ఫ్ భూముల వివాదంలో ముజాహిద్ ఆలం ఖాన్, మహబూబ్ ఆలం ఖాన్‌లతో ఉన్న పాత కక్షల వల్లే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు ముమ్మరమైంది.

మరింత Hit And Run: కారుతో ఢీకొట్టి ప్రముఖ న్యాయవాది హత్య.. భూవివాదమే కారణమా?
Rukmini Vasanth

Rukmini Vasanth: ఆ బికినీ ఫోటోలు నావి కావు.. అవన్నీ ఏఐ (AI) ఫోటోలు..!

Rukmini Vasanth: సోషల్ మీడియాలో తన పేరుతో సర్క్యులేట్ అవుతున్న బికినీ ఫోటోలు, స్విమ్మింగ్ పూల్ వీడియో క్లిప్స్ అన్నీ నకిలీవని నటి రుక్మిణి వసంత్ స్పష్టం చేశారు. అవన్నీ ఏఐ (AI), డీప్‌ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసినవని.. దీనిపై సైబర్ క్రైమ్ చర్యలు ప్రారంభించామని తెలిపారు. ఆ నకిలీ కంటెంట్‌ను ఎవరూ షేర్ చేయవద్దని నెటిజన్లను కోరారు.

మరింత Rukmini Vasanth: ఆ బికినీ ఫోటోలు నావి కావు.. అవన్నీ ఏఐ (AI) ఫోటోలు..!
C.M. Ramesh

C.M. Ramesh: వివేకా హత్యపై సోషల్ మీడియాలో పోల్ పెట్టండి.. మీపైనే ఆరోపణలు వస్తాయి

C.M. Ramesh: వివేకా హత్య కేసుపై వైఎస్ జగన్ వ్యాఖ్యలకు మంత్రి పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. వివేకా హత్యపై వైసీపీ సోషల్ మీడియాలోనే పోల్ పెడితే 80% ఆరోపణలు జగన్ పైనే వస్తాయని, అలా రాకపోతే తాను రాజకీయం వదిలేస్తానని సవాల్ చేశారు. సీబీఐ విచారణలో వైఎస్ భాస్కర్ రెడ్డి ముద్దాయిగా తేలి జైల్లో ఉన్నా.. ఇంకా ఇతరులను ఇరికించాలని చూడటం సరికాదన్నారు.

మరింత C.M. Ramesh: వివేకా హత్యపై సోషల్ మీడియాలో పోల్ పెట్టండి.. మీపైనే ఆరోపణలు వస్తాయి
Payyavula Keshav

Payyavula Keshav: రాజకీయాల కోసం ఫ్యాక్షనిజాన్ని వాడుకున్నారు

Payyavula Keshav: వైఎస్ కుటుంబం వల్లే రాష్ట్రంలో నేరమయ రాజకీయాలు, ఫ్యాక్షనిజం మొదలయ్యాయని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. రాజారెడ్డి కాలంలో డైనమైట్లతో ఇళ్లు పేల్చారని, నేడు జగన్ అమాయకుడిలా నటిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో ఇళ్లు కూలుస్తూ, పరిశ్రమలపై గొడ్డలివేటు వేశారని.. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో 800 కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయని పయ్యావుల తెలిపారు.

మరింత Payyavula Keshav: రాజకీయాల కోసం ఫ్యాక్షనిజాన్ని వాడుకున్నారు
China Coal Mine Blast

China Coal Mine Blast: బొగ్గు గనిలో భారీ గ్యాస్ పేలుడు.. 85కు చేరిన మరణాల సంఖ్య!

China Coal Mine Blast: ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్ బొగ్గు గనిలో శుక్రవారం రాత్రి జరిగిన గ్యాస్ పేలుడులో 82 మందికి పైగా కార్మికులు మరణించారు. గనిలో కార్బన్ మోనాక్సైడ్ అలర్ట్ వచ్చిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ప్రీమియర్ లీ కియాంగ్ లు రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేయాలని మరియు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మరింత China Coal Mine Blast: బొగ్గు గనిలో భారీ గ్యాస్ పేలుడు.. 85కు చేరిన మరణాల సంఖ్య!
NEET UG 2026

NEET UG 2026: ఫీజు రీఫండ్ చేస్తున్న NTA.. వెంటనే డీటెయిల్స్ లేకపోతే డబ్బులు రానట్లే

NEET UG 2026: రద్దయిన నీట్ యూజీ 2026 పరీక్ష ఫీజు రీఫండ్ ప్రక్రియను ఎన్‌టీఏ ప్రారంభించింది. అభ్యర్థులు మే 27 లోపు neet.nta.nic.in లో తమ బ్యాంక్ వివరాలను నమోదు చేసుకోవాలి. సర్వర్ రద్దీ వల్ల రాత్రి వేళల్లో అప్లై చేసుకోవాలని, ఫేక్ లింకులతో జాగ్రత్తగా ఉండాలని ఎన్‌టీఏ సూచించింది. కాగా, నీట్ రీ-ఎగ్జామ్ జూన్ 21న జరగనుంది.

మరింత NEET UG 2026: ఫీజు రీఫండ్ చేస్తున్న NTA.. వెంటనే డీటెయిల్స్ లేకపోతే డబ్బులు రానట్లే
Virat Kohli

Virat Kohli: ట్రావిస్ హెడ్‌పై విరాట్ కోహ్లీ సీరియస్.. కోహ్లీ నుండి ఎక్స్‌పెక్ట్ చేయలేదు

Virat Kohli: నిన్న జరిగిన ఆర్‌సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. మ్యాచ్‌లో ఆర్‌సీబీ 55 పరుగులతో ఓడిపోయాక, కరచాలనం చేసే సమయంలో కోహ్లీ కోపంతో హెడ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా విస్మరించాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ 255 పరుగులు చేయగా, ఆర్‌సీబీ 200 పరుగులకే పరిమితమైంది. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న ఆర్‌సీబీ, మే 26న క్వాలిఫయర్-1 లో జీటీ (GT) తో తలపడనుంది.

మరింత Virat Kohli: ట్రావిస్ హెడ్‌పై విరాట్ కోహ్లీ సీరియస్.. కోహ్లీ నుండి ఎక్స్‌పెక్ట్ చేయలేదు