Virat Kohli: ఐపీఎల్ వేదికగా మైదానంలో మరోసారి హైడ్రామా చోటుచేసుకుంది. నిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ల మధ్య గట్టి వాగ్వాదం జరిగింది. ఈ గొడవ అక్కడితో ఆగలేదు.. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా విరాట్ కోహ్లీ తీవ్ర కోపంతో ఊగిపోయాడు. దీనికి సంబంధించిన ‘నో షేక్‌హ్యాండ్’ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీపై సన్‌రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకునే సమయంలో అసలు సీన్ జరిగింది. ట్రావిస్ హెడ్ నవ్వుతూ కోహ్లీకి షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి ముందుకు వచ్చినా.. విరాట్ కోహ్లీ అతనితో కరచాలనం(hand shake) చేయడానికి నిరాకరించాడు. అంతేకాదు, అతని ముఖంలోకి కూడా చూడకుండా పూర్తిగా విస్మరిస్తూ (ఇగ్నోర్ చేస్తూ) ముందుకు వెళ్ళిపోయాడు. ఈ ఘటనపై ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చ నడుస్తోంది.
Virat Kohli refused handshake with Travis Head, as both had some heat moments between the game. SRH vs RCB ☠️ #ViratKohli #RCB #IPL #SRHvsRCB pic.twitter.com/7j6kdaCyxB
— 𝐙𝐮𝐛𝐚𝐢𝐫𝐑🕊 (@iiZub22) May 22, 2026
అసలు వారిద్దరి మధ్య గొడవ ఎందుకు జరిగింది?
హైదరాబాద్ నిర్దేశించిన 256 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి ఆర్‌సీబీ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఈ మాటల యుద్ధం మొదలైంది. క్రీజులో ఉన్న కోహ్లీని ఉద్దేశించి ట్రావిస్ హెడ్ అన్న కొన్ని మాటలు విరాట్‌కు తీవ్ర చికాకు తెప్పించాయి. దాంతో కోహ్లీ గట్టిగా బదులిస్తూ.. “నువ్వు అంతగా మాట్లాడితే రా.. కొన్ని ఓవర్లు బౌలింగ్ చేయ్ చూద్దాం” అంటూ హెడ్‌కు సవాలు విసిరాడు.
#ViratKohli 🆚 #TravisHead 🥵🤯
Tensions rise in high voltage clash🔥#TATAIPL Race to Playoffs 2026 👉 #SRHvRCB | LIVE NOW ➡️https://t.co/52qPTW2gSO pic.twitter.com/JOiWaxNW6T
— Star Sports (@StarSportsIndia) May 22, 2026
కానీ దురదృష్టవశాత్తూ, కోహ్లీ ఆ మ్యాచ్‌లో కేవలం 15 పరుగులకే అవుటయ్యాడు. ఈ ఇన్నింగ్స్ కోహ్లీని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆ తర్వాత ట్రావిస్ హెడ్, కోహ్లీని మరింత రెచ్చగొడుతూ.. “నేను బౌలింగ్ చేయడానికి రాకముందే నువ్వు అవుట్ అయిపోయావుగా!” అంటూ మళ్ళీ కామెంట్ చేశాడు. మీడియా నివేదికల ప్రకారం, హెడ్ అన్న ఈ మాటే విరాట్ కోహ్లీకి విపరీతమైన కోపం తెప్పించింది. ఆ కసితోనే మ్యాచ్ ముగిశాక హెడ్‌ను కోహ్లీ పూర్తిగా పక్కన పెట్టేసాడు.
మ్యాచ్ విషయానికి వస్తే.. ఎస్‌ఆర్‌హెచ్ పరుగుల విధ్వంసం!
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ (56), హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ (79) ల విధ్వంసకర బ్యాటింగ్ సహాయంతో ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత ఓవర్లలో 255 పరుగుల భారీ స్కోరును సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత ఓవర్లలో కేవలం 200 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఈ ఓటమి ఎదురైనప్పటికీ, ఆర్‌సీబీ ఈ ఏడాది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న గుజరాత్ టైటాన్స్ (GT), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) లు కూడా చెరో 18 పాయింట్లతో ఉన్నప్పటికీ.. బెంగళూరు అత్యుత్తమ నెట్ రన్ రేట్ (+0.783) తో టాప్‌లో ఉంది. మే 26న ధర్మశాలలో జరగనున్న క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో బెంగళూరు, గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.
