Raja Saab: సలార్’, ‘కల్కి 2898 ఎ.డి.’ చిత్రాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ‘బాహుబలి -2’ తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ నేపథ్యంలో ‘సలార్’తో ప్రభాస్ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఆ తర్వాత వచ్చిన ‘కల్కి’ దానిని మించిన విజయాన్ని అందుకుని ప్రభాస్ ను మరోసారి వెయ్యి కోట్ల క్లబ్ లోకి తీసుకెళ్ళింది. ఈ నేపథ్యంలో మారుతీ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ‘రాజా సాబ్’పై అందరూ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇది కూడా చదవండి: Dil Raju: ఎఫ్.డి.సి. ఛైర్మన్ గా దిల్ రాజు ప్రమాణ స్వీకారం
Raja Saab: ఏప్రిల్ 10న రాబోతున్న ఈ సినిమాతో ప్రభాస్ హ్యాట్రిక్ సక్సెస్ అందుకుంటాడని అతని అభిమానులు సైతం ఆశ పడ్డారు. కానీ ఇప్పుడీ సినిమా ఏప్రిల్ 10న విడుదల కాకపోవచ్చునని తెలుస్తోంది. ఎందుకంటే అదే రోజున బీవీయస్ ఎన్ ప్రసాద్… తాను సిద్దూ జొన్నలగడ్డతో నిర్మించబోతున్న ‘జాక్’ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 10న ‘రాజా సాబ్’ రాకపోవడం వల్లే దీనిని బీవీయస్ఎన్ ప్రసాద్ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది!