Guinea soccer tragedy

Guinea soccer tragedy: దారుణం.. ఫుట్‌బాల్ మ్యాచ్ లో ఘర్షణలు.. 100మంది మృతి!

Guinea soccer tragedy: పశ్చిమ ఆఫ్రికా కు చెందిన గినియాలోని రెండవ అతిపెద్ద నగరమైన న్జెరెకోర్(N’Zérékoré)లో ఆదివారం జరిగిన విషాద ఫుట్‌బాల్ మ్యాచ్ ఘోరంగా మారింది. అభిమానుల మధ్య ఘర్షణల్లో వందలాది మంది మరణించినట్లు తెలుస్తోంది.  అక్కడి మీడియా రిపోర్ట్స్ ప్రకారం గినియాలో సాకర్ మ్యాచ్ సందర్భంగా ఆదివారం జరిగిన ఘర్షణల్లో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు.

Guinea soccer tragedy: పశ్చిమ ఆఫ్రికా దేశంలోని రెండవ అతిపెద్ద నగరమైన న్జెరెకోర్ నగరంలో లాబ్-న్జెరెకోర్ సాకర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో హింస చెలరేగింది. ఎంత మంది మృతి చెందారనే దానిపై ఆదివారం స్పష్టత రాలేదు. కానీ, స్థానిక ఆసుపత్రి మూలాలను ఉటంకిస్తూ అక్కడి  మీడియా  “డజన్ల మంది మరణించారు” అని వెల్లడించింది. ఒక వైద్యుడు మరణాల సంఖ్య “సుమారు 100” మందికి దగ్గరగా ఉందని అంచనా వేశారు.

గినియా ప్రధాన మంత్రి బహౌరీ ఆదివారం X లో ఒక ప్రకటనలో హింసను ఖండించారు. “ఈ రోజు మధ్యాహ్నం న్జెర్‌కోర్‌లో లాబ్ – న్జెరెకోర్ జట్ల మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఘర్షణలపై ప్రభుత్వం విచారిస్తుంది” అని తన పోస్ట్ లో పేర్కొన్నారు. 

“గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించడంలో ఆసుపత్రి సేవలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రశాంతంగా ఉండాలని” పిలుపునిచ్చారు బాహౌరీ. 

Guinea soccer tragedy: హింసకు దారి తీసిన విషయం స్పష్టంగా తెలియరాలేదు. ఒక రిఫరీ చేసిన వివాదాస్పద కాల్‌తో గొడవలు చెలరేగాయని, అది అభిమానులను మైదానంలోకి దండెత్తడానికి దారితీసిందని ఏజెన్సీ ఫ్రాన్స్-ప్రెస్ ప్రత్యక్ష సాక్షుల కథనంగా చెప్పింది. 

స్థానిక ఆసుపత్రిలోని ఒక వైద్యుడు ఏజెన్సీ ఫ్రాన్స్-ప్రెస్‌తో మాట్లాడుతూ ఆసుపత్రులు మృతదేహాలతో నిండిపోతున్నాయని చెప్పారు.

Guinea soccer tragedy: ఈ మ్యాచ్  2021లో అధికారాన్ని చేజిక్కించుకున్న గినియా సైనిక నాయకుడు కల్నల్ మమడి డౌంబౌయాను గౌరవించే టోర్నమెంట్‌లో భాగంగా నిర్వహించారు.  దాదాపు 2,00,000 మంది జనాభా ఉన్న న్జెరెకోర్ రాజధానికి ఆగ్నేయంగా 555 మైళ్ల దూరంలో ఉంది.

ALSO READ  Airport: తెలంగాణలో మరో ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

2 Replies to “Guinea soccer tragedy: దారుణం.. ఫుట్‌బాల్ మ్యాచ్ లో ఘర్షణలు.. 100మంది మృతి!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *