PV Sindhu

PV Sindhu: సింధు ఎట్టకేలకు

PV Sindhu: సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పి.వి.సింధు, లక్ష్యసేన్ విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సింధు 21-14, 21- 16తో ప్రపంచ 119వ ర్యాంకర్ వు లుయో యు (చైనా)పై విజయం సాధించింది. వరుస గేమ్ల ప్రత్యర్థిని చిత్తుచేసిన సింధు.. రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ టోర్నీ టైటిల్ నెగ్గింది. సింధు చివరిగా 2022 జులైలో సింగపూర్ ఓపెన్లో విజేతగా నిలిచింది. సయ్యద్ మోదీ టోర్నీలో సింధు ఛాంపియన్ గా నిలవడం ఇది మూడో సారి. 2017, 2022లలో ఆమె టైటిళ్లు సాధించింది.

పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ లక్ష్యసేన్ 21-6, 21-7తో జియా హెంగ్ జేసన్ (సింగపూర్)ను మట్టికరిపించాడు. కేవలం 31 నిమిషాల్లోనే పని పూర్తిచేసిన లక్ష్యసేన్.. ప్రత్యర్థిపై తన విజయాల రికార్డును 3-0తో మరింత మెరుగుపరుచుకున్నాడు. మహిళల డబుల్స్ లో గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ జోడీ ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్లో ఈ జంట 21-18, 21-11తో లీ జిగ్- లీ కియాన్ (చైనా) జోడీపై విజయం సాధించింది. తొలి గేమ్లో కాస్త ప్రతిఘటన ఎదుర్కొన్న భారత జోడీ.. రెండో గేమ్ను ఏకపక్షంగా ముగించి మొదటి సారిగా సయ్యద్ మోదీ టైటిల్ను సొంతం చేసుకుంది. పురుషుల డబుల్స్ పృథ్వీ రాయ్- సాయి ప్రతీక్ జోడీ రన్నరప్ గా నిలిచింది. ఫైనల్లో ఈ ద్వయం 14-21, 21-19, 17-21తో హువాంగ్- యాంగ్ (చైనా) చేతిలో పరాజయం చవిచూసింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ధ్రువ్ కపిల- తనీషా క్రాస్టో జోడీ 21-18, 14-21, 8-21తో దెచపోల్- సుపిసర (థాయ్లాండ్) జంట చేతిలో పోరాడి ఓడి రన్నరప్ గా నిలిచింది.

ఇది కూడా చదవండి: Guinea soccer tragedy: దారుణం.. ఫుట్‌బాల్ మ్యాచ్ లో ఘర్షణలు.. 100మంది మృతి!

2028 ఒలింపిక్స్ ఆడతా

2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్లోలో తప్పక ఆడతానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు తెలిపింది. “సయ్యద్ మోదీ టోర్నీ విజయం నాకు కచ్చితంగా చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. నా వయసు 29 ఏళ్లు కావడం ఎన్నో రకాలుగా కలిసొచ్చే అంశం. నాకెంతో అనుభవం ఉంది. బ్యాడ్మింటన్లో తెలివి, అనుభవం చాలా ముఖ్యం. రాబోయే కొన్నేళ్లు ఆటలో కొనసాగుతా. గాయాలు లేకుండా ఉండటమే నా ప్రధాన లక్ష్యం. లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ చాలా దూరంలో ఉన్నాయి. ఒలింపిక్స్లో కచ్చితంగా ఆడతా. కానీ గాయాలకు దూరంగా ఉంటూ.. ఆటను ఆస్వాదించడం అత్యంత కీలకం. ఫిట్గా ఉంటే ఒలింపిక్స్ ఎందుకు ఆడను” అని సింధు పేర్కొంది.

ALSO READ  Devendra Fadnavis: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

One Reply to “PV Sindhu: సింధు ఎట్టకేలకు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *