home tips

Home Tips: తొక్కే అని పారేయకండి.. ఇలా చేస్తే దోమలు పరార్!

Home Tips: చాలా మంది అరటిపండ్లు తిని, తొక్కను పారేస్తారు. కానీ ఈ అరటిపండు తొక్కలో పోషకాలు, ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ తొక్క చర్మానికి చాలా మేలు చేస్తుంది. అనేక చర్మ వ్యాధులను నయం చేసే శక్తి కలిగి ఉంటుంది. కానీ ఈ అరటిపండు తొక్క దోమలను తరిమికొడుతుంది. దోమలను అరికట్టడానికి పీల్స్‌ని ఉపయోగించడానికి అనేక మార్గాలు ఉన్నాయి.

దోమలను తరిమికొట్టేందుకు కూడా ఈ అరటి తొక్క ఎంతో మేలు చేస్తుంది. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే పడుకునే గంట ముందు అరటిపండు తొక్కను గదిలోని నాలుగు మూలల్లో పెట్టాలి. ఈ పొట్టు వాసనకు దోమలు కూడా రావు. అరటిపండు తొక్కలు తీసి మిక్సర్‌లో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్టును ఇంటి మూలలకు రాస్తే దోమలను దూరంగా ఉంచుతుంది. ఇలా చేయడం వల్ల దోమల బెడద నుంచి సులభంగా బయటపడవచ్చు. అరటిపండు తొక్కలను కాల్చడం వల్ల కూడా దోమలను తరిమికొట్టవచ్చు. అరటిపండు తొక్కలను పొడిగా ఉంచి అగరబత్తిలా పొగ పెడితే దోమలు ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండవు.

Home Tips: అరటి పండు తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ స్కిన్ కి ఎంతో మేలు చేస్తాయి. తొక్క లోపలి వైపు భాగంతో మీ ఫేస్ ని రుద్దండి, ఒక అరగంట ఆగాక శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోండి. ఇలా రెగ్యులర్ గా చేశారంటే మీ ముఖం మీద ఉన్న ముడతలు తగ్గిపోతాయి. స్వెల్లింగ్, ఎర్రదనం, స్కార్స్ వంటి అనేక స్కిన్ ప్రాబ్లమ్స్ కి అరటి పండు తొక్క మంచి మందు. అరటి పండు తొక్క యొక్క లోపలి భాగాన్ని అవసరమైన ప్రదేశంలో అప్లై చేయండి. ఒక గంట అలాగే ఉంచండి. మీకు సౌకర్యంగా ఉంటే రాత్రంతా ఉంచేసినా ప్రాబ్లమ్ లేదు. రోజూ ఇలా చేయండి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Cucumber Benefits: దోసకాయతో షుగర్ కంట్రోల్.. ఎలానో తెలుసా ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *