AP Rice Mafia

AP Rice Mafia: ఏపీ రైస్ మాఫియా కోరలు దేశవ్యాప్తంగా.. ద్వారంపూడి బ్రదర్స్ మామూలోళ్లు కాదు.. 

AP Rice Mafia: ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని అడ్డు పెట్టుకుని రైస్ దందా సాగించిన ద్వారంపూడి బ్రదర్స్ మహారాష్ట్రలో అడ్డంగా బుక్కయ్యారు. అదేమిటి.. ఇక్కడ రైస్ దందా చేస్తే అక్కడెక్కడో బుక్కవడం ఏమిటి అనుకోవద్దు. ఇక్కడ అధికారం ఉందని రైస్ మాఫియా యథేచ్ఛగా రెచ్చిపోయింది. ఇక్కడ రేషన్ బియ్యాన్ని అడ్డగోలుగా ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేసేస్తూ వస్తున్న వీరు.. మహారాష్ట్ర తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఎగుమతి కోసం కాకినాడ పోర్టుకు బియ్యం తీసుకువచ్చే వ్యాపారులను బెదిరించి కోట్లాదిరూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే అక్రమ వ్యాపారానికి సంబంధించి ఎటువంటి అవకాశాన్ని ద్వారంపూడి బ్రదర్స్ వదులుకోవడం లేదు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించడమే కాకుండా కాకినాడ పోర్టులో మొత్తం ఎగుమతి, దిగుమతి కార్యక్రమాలను పూర్తిస్థాయిలో నియంత్రిస్తూ కోట్లాది రూపాయల దందా సాగిస్తున్నారు. ఈ విషయం మహారాష్ట్రకు చెందిన ఒక బియ్యం వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. పోలీసుల దర్యాప్తులో వీరు చేస్తున్న దందా వెలుగులోకి వచ్చింది. పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. అసలు వీళ్ళు చేస్తున్న దందా ఎలా ఉంటుందో మహారాష్ట్ర వ్యాపారి చేసిన ఫిర్యాదు చూస్తే అర్ధం అవుతుంది. అక్కడి మీడియా కూడా ఈ విషయాన్ని వివరంగా ప్రచురించింది. ఆ వివరాలు చూద్దాం. 

AP Rice Mafia: బియ్యం ఎగుమతులు చేయాలంటే డబ్బు ఇవ్వాలని బెదిరించి మహారాష్ట్రకు చెందిన ఓ పారిశ్రామికవేత్త నుంచి రూ. 1.69 కోట్లు దోపిడీ చేశారు. ఈ విషయమై ఆ పారిశ్రామిక వేత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాకినాడకు చెందిన రైస్ ఎక్స్‌పోర్ట్ అసోసియేషన్ (TREA) ప్రెసిడెంట్‌పై లాకడ్‌గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. BV కృష్ణారావు, చినబాబు రెడ్డి, విపిన్ అగర్వాల్, లక్ష్మీ వెంకటేశ్వరావు దోపిడీకి పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: Maharashtra CM: ఇంకా వీడని మహారాష్ట్ర ముఖ్యమంత్రి చిక్కుముడి

AP Rice Mafia: లకడ్‌గంజ్‌లోని శ్రీరామ్ ఫుడ్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనూప్ అగర్వాల్, బియ్యం దిగుమతి – ఎగుమతివ్యాపారం చేస్తున్నారు. కాకినాడ పోర్టు నుంచి ఆయన కంపెనీ బియ్యాన్ని విదేశాలకు పంపుతుంది. అగ్‌గర్వాల్ కాకినాడకు చెందిన లోటస్ మెరైన్ షిప్పింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారు ఏప్రిల్ 2023లో 30,000 మెట్రిక్ టన్నుల బ్రోకెన్ బియ్యాన్ని సెనెగల్‌కు ఎగుమతి చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.  అగర్వాల్ వివిధ రాష్ట్రాల నుండి బ్రోకెన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఎగుమతి కోసం లోటస్ కంపెనీ గోదాములో ఉంచారు.

ALSO READ  AP Cabinet Meet: ఏపీ క్యాబినెట్ భేటీ ఈనెల 10న అజెండా ఇదే!

ద్వారంపూడి బ్రదర్స్ అండ్ కో దందాపై మహారాష్ట్రలో ప్రచురితమైన వార్తా కథనాల క్లిపింగ్స్ ఇక్కడ చూడొచ్చు.. 

ap rice mafia

AP Rice Mafia: లోటస్ మెరైన్ శపింగ్ కంపెనీ నుంచి ఏప్రిల్ 29, 2023న అగర్వాల్‌కి ఫోన్  వచ్చింది. షిప్ లో బియ్యం లోడ్ చేయడానికి అనుమతించవద్దని TREA బెదిరించిందని చెప్పాడు. TREA అనేది కాకినాడ నుండి బియ్యం ఎగుమతిదారుల సంస్థ. అగర్వాల్ TREA కి చెందిన  చినబాబు రెడ్డి, విపిన్ అగర్వాల్‌లను సంప్రదించి, TREAలో సభ్యుడిగా ఉన్నప్పటికీ బియ్యం లోడ్ చేయడానికి ఎందుకు అనుమతించలేదని అడిగారు. దీంతో వారు విపిన్ అగర్వాల్‌ని ఈ విషయంపై మాట్లాడుకుందాం రమ్మని కాకినాడకు పిలిపించారు.

ఇది కూడా చదవండి: EVM Verification: మహారాష్ట్రలో ఈవీఎంల వెరిఫికేషన్ కోరిన 11 మంది అభ్యర్థులు

AP Rice Mafia: అనూప్ అగర్వాల్ ఫిర్యాదు ప్రకారం,  మే 1, 2023న, అగర్వాల్ కాకినాడ చేరుకుని వారిద్దరినీ కలిశారు. అప్పుడు ఆ ఇద్దరూ టన్నుకు 10 డాలర్ల చొప్పున 2.49 కోట్లు ఇవ్వాలని అడిగారు.  ‘మీ కంపెనీ భారీ లాభాలు ఆర్జిస్తోంది’ అందువల్ల డబ్బు ఇవ్వాల్సిందే లేకపోతె ఎగుమతి జరగదు అని బెదిరించారు. తానూ ఎగుమతి చేయాల్సిన బియ్యం ధర దాదాపు 125 కోట్లు కావడంతో, అగర్వాల్ భారీ నష్టాల గురించి ఆందోళనలో పడ్డారు. దీంతో వారికీ నచ్చ చెప్పి.. బ్రతిమాలుకున్నారు. అప్పుడు అనేకసార్ల చర్చల తరువాత, అగర్వాల్ 1.69 కోట్లు చెల్లించదానికి ఒప్పందం కుదిరింది. ఆయన నాగ్‌పూర్‌కు తిరిగి వచ్చి డబ్బు అరేంజ్ చేస్తానని హామీ ఇచ్చారూ. అనంతరం  TREA ప్రెసిడెంట్ BV కృష్ణారావును కలిసి అతను దోపిడీ గురించి ఫిర్యాదు చేశారు. 

AP Rice Mafia: అయినా ఫలితం లేకపోయింది. దీంతో చేసేది ఏమీలేక డబ్బు చెల్లించడానికి సిద్ధం అయ్యారు. ఇక్కడ డబ్బును TREA ఎకౌంట్ కు కాకుండా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర హైజీనిక్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎకౌంట్  నంబర్‌కు పంపించాలని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తమ్ముడు వీరభద్రారెడ్డి, విపిన్ అగర్వాల్‌లు సూచించారు.  ఈ పేమెంట్  లక్ష్మీ వైంకటేశ్వర నుంచి బియ్యం కొనుగోలు కోసం చేస్తున్నట్టుగా ఎకౌంట్ బుక్స్ లో చూపించాలని వారు చెప్పారు. దీనికోసం 1.69 కోట్ల విలువైన అమ్మకం బిల్లును కూడా అగర్వాల్ ఇచ్చాడు. వాస్తవానికి బియ్యం పంపిణీ చేయలేదు. అనూప్ అగర్వాల్ రెండు విడతల్లో రూ. 1.69 కోట్లను లక్ష్మీ వెంకటేశ్వర్లకు బదిలీ చేశారు. దీని తరువాత, TREA బియ్యాన్ని ఓడలోకి లోడ్ చేయడానికి అనుమతించింది. TREA ద్వారా దోపిడీపై అగర్వాల్ లకడ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి పోలీసులు విచారణ జరిపి మోసం, దోపిడీ, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో ద్వారంపూడి బ్రదర్స్ అండ్ కో ఇదే తరహాలో పలు రాష్ట్రాల ఎగుమతిదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు తేలిందని చెబుతున్నారు. 

ALSO READ  Amaravati: అమరావతి అభివృద్ధికి తిరుగులేదు..మరో 8 వేల కోట్లు సాయం ..!

మొత్తమ్మీద చూసుకుంటే ద్వారంపూడి బ్రదర్స్ అక్రమంగా రేషన్ బియ్యం రవాణా చేయడం మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి బియ్యం ఎగుమతి చేసే వ్యాపారులను కూడా బెదిరించి డబ్బు వసూలు చేశారనేది స్పష్టం అవుతోంది. ఇప్పటికే ఈ విషయంలో మహారాష్ట్ర పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన ఈ అక్రమ దందాలపై ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దర్యాప్తు చేస్తే కాకినాడ పోర్టులో జరుగుతున్న మరిన్ని అక్రమాలు బయటపడతాయని భావిస్తున్నారు. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *