Siddhu Jonnalagadda

Siddhu Jonnalagadda: ఏప్రిల్ 10న ‘జాక్’గా రాబోతున్న సిద్ధు జొన్నలగడ్డ

Siddhu Jonnalagadda: డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ చిత్రాలతో స్టార్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. ఇప్పుడు ‘జాక్’, ‘తెలుసు కదా’ చిత్రాలలో నటిస్తున్నాడు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ‘జాక్ – కొంచెం క్రాక్’ మూవీ విడుదల తేదీని మేకర్స్ తాజాగా ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Neha Shetty: పవన్ ‘ఓజీ’లో నేహాశెట్టి ఐటమ్ సాంగ్

Siddhu Jonnalagadda: ఈ చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ సరసన ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య నటిస్తున్నారు. కీలక పాత్రలో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ వంటి వారు కనిపించనున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ 80 శాతం పైగానే పూర్తయ్యింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈ మూవీని గ్రాండ్గా విడుదల చేయబోతోన్నారు నిర్మాత బీవీయస్ఎన్ ప్రసాద్.ఈ చిత్రంలో సిద్దు పాత్ర అందరినీ ఆకట్టుకునేలా ఉండబోతోందని, పూర్తి వినోదాత్మకంగా రాబోతోన్న ఈచిత్రానికి అచ్చు రాజమణి సంగీతాన్ని అందిస్తున్నారని ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *