EVM Verification: మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, 11 మంది అభ్యర్థులు తమ జిల్లాల్లోని 137 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మైక్రో కంట్రోలర్‌లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం మొత్తం రూ.66.64 లక్షలను ఈసీకి చెల్లించారు.
ఈ అభ్యర్థుల్లో ఎన్సీపీ(ఎస్పీ)కి చెందిన బారామతి అభ్యర్థి యుగేంద్ర పవార్, ఎన్సీపీ(ఎస్పీ) హడప్సర్ అభ్యర్థి ప్రశాంత్ జగ్తాప్, కాంగ్రెస్ పుణె కంటోన్మెంట్ అభ్యర్థి రమేష్ బాగ్వే ఉన్నారు. ఈవీఎంల పరీక్షల కోసం జిల్లా అధికార యంత్రాంగానికి వీరు అప్పీల్ చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన ఏడు రోజుల్లోగా ఈ దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. ఈ గడువు శుక్రవారంతో ముగిసింది.
ఇది కూడా చదవండి: EVM Hack: ఈవీఎంలను హ్యాక్ చేశారంటూ ఈసీ కేసు
EVM Verification: అభ్యర్థులు అసెంబ్లీలోని 5% ఈవీఎంల వెరిఫికేషన్‌ను కోరవచ్చు, సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం, ఎన్నికల్లో రెండవ, మూడవ స్థానంలో నిలిచే అభ్యర్థులు అసెంబ్లీలో ఉపయోగించిన 5% ఈవీఎంల మైక్రోచిప్‌లను ధృవీకరించాలని డిమాండ్ చేయవచ్చు. దీనికోసం వ్రాతపూర్వక రిపోర్ట్ ను డిమాండ్ చేయవచ్చు.
ఈ దరఖాస్తులపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయానికి సమాచారం అందించినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రధాన కార్యాలయం ఆదేశాల మేరకు మాక్‌పోల్ నిర్వహించనున్నారు. అభ్యర్థులు, కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు – VVPATలను తయారు చేసే సంస్థల ఇంజనీర్ల సమక్షంలో ఈవీఎంల పరిశీలన జరుగుతుంది.
2 Replies to “EVM Verification: మహారాష్ట్రలో ఈవీఎంల వెరిఫికేషన్ కోరిన 11 మంది అభ్యర్థులు”