ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనబోయే ప్రతి ఒక్క జట్టు తమ స్క్వాడ్ ను టోర్నీ మొదలయ్యే నెలరోజుల ముందే ప్రకటించింది. ఇక ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు లో అయితే అందరికంటే ముందు తమ ప్లేయర్లను ఫిక్స్ చేసుకున్నారు. భారత్ కూడా వారం రోజులు ముందే తమ తుది జట్టును ప్రకటించింది. అయితే పాకిస్తాన్ మాత్రం ఇప్పటికీ వారి జట్టును బయటపెట్టలేదు.
ఇప్పుడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఇదే విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై, కోచింగ్ మరియు మేనేజ్మెంట్ స్టాఫ్ పై విరుచుకుపడుతున్నాడు. “ఏంటి పాకిస్తాన్ వాళ్ళు భయపడుతున్నారా?” అంటూ సొంతదేశాన్ని హేళనగా మాట్లాడాడు. పాకిస్తాన్ జట్టు ఒక పక్క భయపడుతోందని చెబుతూనే… వారి వద్ద ఛాంపియన్స్ ట్రోఫీలో మేటిజట్లకు సవాలు చేసే టీం లేదంటూ చురకలు అంటించాడు.
ఇది కూడా చదవండి: Arshdeep: సరికొత్త రికార్డు సృష్టించిన అర్ష్ దీప్ సింగ్..!
పాకిస్తాన్ కీలక ప్లేయర్లు అయిన బాబర్ ఆజాం, మహమ్మద్ రిజ్వాన్ మినహాయిస్తే మిగిలిన వారంతా చాలా తక్కువ అనుభవం ఉన్న ఆటగాళ్లు అని… టి20 ప్లేయర్లు వన్డే ఫార్మాట్ లో ఏమాత్రం రాణించగలరు అంటూ ప్రశ్నించాడు. అంతేకాకుండా చాలామంది ఆటగాళ్ల ఫిట్ నెస్ గందరగోళంగా ఉందని… వారిని స్క్వాడ్ లోనికి తీసుకున్న తర్వాత గాయాల పాలైతే మొదటికే మోసం వస్తుంది అన్నట్లు చెప్పాడు. మరి పాకిస్తాన్ కూడా తమ జట్టును బయటకు ప్రకటిస్తే ప్లేయర్లంతా అందుకు తగినట్లుగా ఈ టోర్నమెంట్ కు తయారు అవుతారు. మరి తమ సొంత దేశపు మాజీ క్రికెటర్ చేసిన ఈ వ్యాఖ్యలను పాకిస్తాన్ బోర్డు సీరియస్ గా తీసుకొని అందుకు తగినట్లు వ్యవహరిస్తుందో లేదో చూడాలి.