Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi: నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ నిరాకరణ

Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు.

ఈ కేసులో వంశీ ఇప్పటికే అరెస్టయ్యి విజయవాడ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. విచారణలో భాగంగా ఆయన తరఫు న్యాయవాది బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే, అందుబాటులో ఉన్న ఆధారాలు, కేసు ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని న్యాయమూర్తి బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read: Kandula Durgesh: సినిమా థియేటర్ల అంశంపై అల్లు అరవింద్ మాట్లాడింది వాస్తవం

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీపై నకిలీ పత్రాలు తయారు చేసి ప్రభుత్వ భూములు ఆక్రమించేందుకు ప్రయత్నం చేశారన్న ఆరోపణలతో కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. బెయిల్ తిరస్కరణతో వంశీకి ఇది తీవ్రమైన పరిణామంగా భావిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *