Henrich Klaasen: కోల్‌కతా నైట్ రైడర్స్ పై జరిగిన మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెన్రిక్ క్లాసెన్ 39 బంతుల్లో 105 పరుగులు చేశాడు. అతని సెంచరీలో 7 ఫోర్లు, 9 సిక్సర్లు బాదాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో అతను సంయుక్తంగా మూడో స్థానానికి చేరుకున్నాడు. అంతేకాకుండా ఈ దక్షిణాఫ్రికా విధ్వంసక బ్యాట్స్‌మన్ భారత మాజీ ఆటగాడు యూసుఫ్ పఠాన్ రికార్డును సమం చేశాడు. రాజస్థాన్ రాయల్స్ తరుపున పఠాన్ 2010లో ముంబై ఇండియన్స్‌పై 37 బంతుల్లో సెంచరీ సాధించాడు.
క్లాసెన్ తర్వాత, దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ జాబితాలో నాల్గవ స్థానానికి పడిపోయాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడిన మిల్లర్, ఐపీఎల్ 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)పై 38 బంతుల్లో సెంచరీ సాధించాడు. మిల్లర్ ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తరపున ఆడుతున్నాడు.
SRH కు చెందిన ట్రావిస్ హెడ్, పంజాబ్ కింగ్స్ కు చెందిన ప్రియాంష్ ఆర్య సంయుక్తంగా ఐదవ స్థానంలో ఉన్నారు. ఇద్దరూ 39 బంతుల్లో సెంచరీలు చేశారు. 2024లో RCBపై ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ హెడ్ అద్భుతమైన సెంచరీ సాధించగా, ప్రియాంష్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఈ వేగవంతమైన సెంచరీ సాధించాడు.
Also Read: RCB: ఆర్‌సిబి జట్టుకు మరో షాక్.. ఇంటికి వెళ్లనున్న కీలక ఆటగాడు
Henrich Klaasen: ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. 2013లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వెస్టిండీస్ మాజీ గ్రేట్ బ్యాట్స్‌మన్ గేల్ 30 బంతుల్లో సెంచరీ సాధించాడు. పుణె వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సిబి తరపున ఆడుతున్నప్పుడు ఈ ఘనతను సాధించాడు. ఇది ఇప్పటికీ ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీగా మిగిలిపోయింది.
14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. IPL 2025లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ సూర్యవంశీ 35 బంతుల్లో సెంచరీ సాధించాడు. IPLలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా అతను రికార్డు సృష్టించాడు.