Sudha Kongara

Sudha Kongara: శివ కార్తికేయన్ పై సుధా కొంగర ఆసక్తికర కామెంట్స్!

Sudha Kongara: కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకురాలు సుధా కొంగరతో కలిసి పరాశక్తి చిత్రంలో నటిస్తున్నారు. సూరరై పొట్రు లాంటి బ్లాక్‌బస్టర్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సుధా, ఈ సినిమాను డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాష్ భాస్కరన్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. జయం రవి, అథర్వ మురళి కీలక పాత్రలు పోషిస్తుండగా, శ్రీలీల తమిళ డెబ్యూ చేస్తున్నారు.

Also Read: Sreeleela: ఇంకెక్కడి లవ్.. మా అమ్మ నాతోనే ఉంటుంది : శ్రీలీల కీలక కామెంట్స్

జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఇటీవల విడుదలైన టీజర్‌తో అభిమానుల్లో హైప్ పెంచింది. ఈ సినిమా కోసం శివ కార్తికేయన్‌ను ఎంచుకోవడం వెనుక కారణాన్ని సుధా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. శివలోని సహజత్వం, నిజాయితీ, పక్కింటి అబ్బాయి లాంటి లుక్ తను రాసిన పాత్రకు సరిగ్గా సరిపోయాయని, అతని నటనలోని స్పష్టత ఈ పాత్రకు జీవం పోస్తుందని సుధా తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Vijaya Rangaraju Dead: ప్రముఖ టాలీవుడ్ విలన్ మృతి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *