Vijaya Rangaraju Dead: ప్రముఖ టాలీవుడ్ విలన్ విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ సోమవారం ఉదయం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. వారం క్రితం హైదరాబాద్‌లో జరిగిన సినిమా షూటింగ్‌లో గాయపడిన విజయ రంగరాజు చికిత్స కోసం చెన్నై వెళ్లి అక్కడే మరణించారు. విజయ రంగరాజుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
విజయ రంగరాజు తొలి చిత్రం బాపు దర్శకత్వం వహించిన ‘సీతా కళ్యాణం’. 1994లో విడుదలైన ‘భైరవ ద్వీపం’ చిత్రంతో ఆయన నటనకు మంచి పేరు తెచ్చుకున్నారు. తరువాత, ఆయన ఎక్కువగా విలన్ గా చేస్తూ సహాయ పాత్రలు కూడా చేశారు అయన నటనతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందారు. ‘యజ్ఞం’ చిత్రంతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. గోపీచంద్ హీరోగా నటించిన యజ్ఞం చిత్రంలో విజయ రంగరాజు విలన్ పాత్రను పోషించారు. ఆయన తెలుగు, తమిళం, మలయాళ చిత్రాలలో కూడా నటించారు. రంగరాజు వెయిట్ లిఫ్టింగ్ మరియు బాడీ బిల్డింగ్‌లో కూడా ప్రావీణ్యం కలిగి ఉన్నారు.