Akkineni Nagarjuna: ప్రస్తుతం ఎంతమంది స్టార్ హీరోస్ వచ్చినా టాలీవుడ్‌కు పిల్లర్స్‌గా ఉన్న సీనియర్ హీరోలంటే గుర్తొచ్చేది చిరు, బాలయ్య, వెంకీ మామ, నాగార్జునలు మాత్రమే. వీరిలో ముగ్గురు సీనియర్లు మాత్రం కుర్ర హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు.
ఒక్కొక్కరు ఒక్కో రికార్డు హోల్డ్ చేస్తున్నారు. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్లకు పైగా వసూళ్లు చేసి సత్తా చూపించారు వెంకటేష్. ఈ రికార్డ్ ఇప్పటిదాకా టాప్ హీరోలుగా కొనసాగుతున్న మహేష్, పవన్ కూడా అందుకోలేకపోయారు.
ఇది కూడా చదవండి:Shreyas Iyer: అంత బాగా ఆడే శ్రేయస్ అయ్యర్ కు జట్టులో చోటు లేదా? పాంటింగ్ అనవసర వ్యాఖ్యలు..!
అలాంటిది వెంకీ మామ 64 ఏళ్ల వయస్సులో అందుకున్నాడు. సీనియర్లలో హైయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన రికార్డ్ వెంకీ పేరు మీదుందిప్పుడు. ఇక ఎక్కువ సార్లు 200 కోట్ల గ్రాస్.. 100 కోట్ల షేర్ అందుకున్న రికార్డ్ మరో సీనియర్ హీరో చిరంజీవి పేరు మీదుంది. రీ ఎంట్రీలో రప్ఫాడిస్తున్నారు మెగాస్టార్.
అలాగే 100 కోట్ల గ్రాసర్స్ ఎక్కువగా మరో సీనియర్ హీరో బాలయ్య దగ్గరున్నాయి. ఈయన అఖండ తర్వాత విశ్వరూపం చూపిస్తున్నారు. కానీ ఈ లిస్టులో కింగ్ నాగార్జున వెనకబడ్డారు. నాగ్ కట్ అవుట్ కి సరైన హిట్ పడితే ఆయనకి రికార్డులు క్రియేట్ చెయ్యడం కొత్త కాదు. మరి తరువాత చేయబోయే సినిమాలతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.