Death Calcualtor: లండన్‌లోని పరిశోధకులు అభివృద్ధి చేసిన కొత్త AI కాలిక్యులేటర్ ఎలక్ట్రో కార్డియోగ్రామ్‌లను ఉపయోగించి ఒక వ్యక్తి మరణ ప్రమాదాన్ని వెల్లడిస్తుంది. వచ్చే ఏడాది నుంచి రెండు ఆసుపత్రుల్లో ఈ టెక్నాలజీని ట్రయల్ చేయాలని UK నేషనల్ హెల్త్ సర్వీస్ యోచిస్తోంది. ఈ AI సాధనం నుండి వందలాది మంది రోగులు సుమారుగా ఆయుర్దాయం అంచనాను పొందబోతున్నారు. ఆ వివరాలేమిటో తెలుసుకుందాం
ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్లినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ ప్రతి రంగాన్ని కవర్ చేస్తూ కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో మనుషులకు చేయాల్సిన పని ఏమైనా మిగులుతుందా అనే సందేహం మొదలైందని చెప్పడంలో ఎటువంటి అనుమానమూ అక్కర్లేదు. పుట్టిన మనిషి ఏదో ఒకరోజు చనిపోవాలి. మనం ఎప్పుడు ఎలా చనిపోతామో ఎవరికీ తెలియదు. అయితే ఇప్పుడు మనం మరణానికి ఎంత దగ్గరగా ఉన్నామో కృత్రిమ మేధస్సు(AI0 చెప్పగలదని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Also Read: Health: హైబ్రిడ్ టమాటోలు మంచివేనా.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..?
Death Calcualtor: అవును, ఇప్పటి నుండి మనం AI కాలిక్యులేటర్ ద్వారా మన మరణం – గుండెపోటు ప్రమాదం గురించి తెలుసుకోవచ్చు. లాన్సెట్ డిజిటల్ హెల్త్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం కొత్త AI కాలిక్యులేటర్ గురించి బ్లాస్టింగ్ న్యూస్ వెల్లడించింది. లండన్ లాన్సెట్ పరిశోధకులు కొత్త కృత్రిమ మేధస్సు కాలిక్యులేటర్‌ను అభివృద్ధి చేశారు. AI- పవర్డ్ ఎలక్ట్రో కార్డియోగ్రామ్‌లు (ECGలు) ఒక వ్యక్తి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు – మరణాల ప్రమాదాన్ని అంచనా వేయడంలో సహాయపడతాయని వారు వెల్లడించారు.
UK హెల్త్ అథారిటీ ఈ కొత్త ఆవిష్కరణను పరీక్షించడానికి సిద్ధంగా ఉంది. వచ్చే ఏడాది మధ్య నుంచి నేషనల్ హెల్త్ సర్వీస్ కింద రెండు ఆసుపత్రుల్లో ఈ సాంకేతికత అందుబాటులోకి రానుంది. దీనితో, వందలాది మంది రోగులు త్వరలో AI “డెత్ కాలిక్యులేటర్” నుండి ఆయుర్దాయం అంచనాలను పొందవచ్చని పరిశోధకులు తెలిపారు.
Death Calcualtor: ఇంకేముంది.. ఎప్పుడు చనిపోతామో తెలిస్తే ముందే అన్నీ జాగ్రత చేసేసుకోవచ్చు. ఇదేదో భలే ఉందే.. మనకెప్పుడు అందుబాటులోకి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? ఎందుకు వచ్చిన టెన్షన్ చెప్పండి. చావు ఎలాగూ తప్పదు. ఎప్పుడు చేస్తామో ముందే తెలిసి దానికోసం పెద్ద టెన్షన్ పడిపోవడం అవసరమంటారా?