Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu: స్పీడ్ పెంచిన హరిహర వీరమల్లు.. రెండో పాట కూడా వచ్చేస్తుంది.. ఆనందంలో ఫ్యాన్స్!

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు”. పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒక వారియర్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం కోసం సుమారు ఐదేళ్ల నుంచి అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఫైనల్ గా ఇపుడు ఈ సినిమా రిలీజ్ కి వస్తుంది. దాంతో వరుసగా అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే మొదటి పాటని రిలీజ్ చేసిన మేకర్స్ రెండో పాటపై సాలిడ్ అప్డేట్ ని అందించారు. పవన్, నిధిలపై సాగే డ్యూయెట్ సాంగ్ ని మేకర్స్ నేడు వాలెంటైన్స్ డే కానుకగా బ్యూటిఫుల్ పోస్టర్ తో అనౌన్స్ చేసేసారు. ఈ సాంగ్ ఈ ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకి రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక ఎం ఎం కీరవాణి కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Nimmala Rama Naidu: మహానాడు సభా ప్రాంగణం పనుల్లో స్వయంగా పాల్గొన్న మంత్రి నిమ్మల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *