Elaichi Benefits: ప్రతి రోజు యాలకులను నమిలి రసం మింగితే పలు ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆస్తమా, దగ్గు, జలుబును తగ్గించడంలో ఇవి బాగా పని చేస్తాయని అంటున్నారు. అలాగే యాలకులను డైలీ తీసుకుంటే గుండె సమస్యలు దూరం అవుతాయి. రక్తహీనత సమస్య ఉన్నవారికి రక్తశాతం పెరిగేందుకు ఇవి ఉపయోగపడతాయి. యాలకులను తినడం వల్ల రక్తశుద్ధి జరిగి విష, వ్యర్థ పదార్థాలు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. వర్షాకాలంలో ఎదురయ్యే అనేక ఇన్ఫెక్షన్లను సులభంగా తొలగించే గుణాలు యాలకులలో ఉన్నాయి. బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లను నిరోధించే యాంటీ మైక్రోబయల్ గుణాలు ఇందులో ఉన్నాయి.
ఈ రోజుల్లో టెన్షన్, బిజీ లైఫ్ స్టైల్, ప్యాక్డ్ ఫుడ్ తినడం వల్ల జనంలో లైంగిక సామర్థ్యం తగ్గుతోంది. దీంతో లైంగిక సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చాలా మంది పిల్లలు అందుకోలేక ఇబ్బంది పడుతున్నారు. దీనికి కారణాలు ఏమైనప్పటికీ యాలకులను వంటి మసాలా దినుసులు ఈ సమస్యలను పరిష్కరించడంలో కొంత వరకు ఉపయోగపడతాయి. యాలకులు మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. దీని వాసన ఒత్తిడిని దూరం చేస్తుంది. కాబట్టి శృంగార జీవితంలో సమస్యలు ఉన్నవారు ఎక్కువగా పండ్లు తినాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
చాలా మందిలో వంధ్యత్వానికి ప్రధాన కారణం తక్కువ స్పెర్మ్ కౌంట్. కానీ రోజుకు 1 నుండి 2 యాలకులు తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. నపుంసకత్వం వంటి లైంగిక సమస్యలు దూరమవుతాయి. యాలకులు చర్మంపై ఉన్న నల్లటి మచ్చలను తగ్గిస్తుంది. కాబట్టి రోజూ టీలో లేదా నేరుగా వంటల్లో దీనిని తీసుకోవడం మంచిది. యాలకులు బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. యాలకులలోని వేడి మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. కాబట్టి ప్రతి రాత్రి ఒక యాలకులు తినండి. బరువు తగ్గడమే కాకుండా శరీరంలోని వ్యర్థాలను, హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది.