Nimmala Rama Naidu: కడప జిల్లా పబ్బాపురం సమీపంలో 150 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతున్న టీడీపీ మహానాడు వేడుకలు ఈసారి రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక గౌరవాన్ని తీసుకురావడం విశేషం. ఈ మహాసభ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తూ, శ్రద్ధగా ముందుండి నేతృత్వం వహిస్తున్నారు మహానాడు కమిటీ కన్వీనర్ నిమ్మల రామానాయుడు.
తాజాగా కురిసిన వర్షం వల్ల సభా ప్రాంగణంలోకి నీళ్లు చేరిన నేపథ్యంలో, మంత్రి నిమ్మల స్వయంగా రంగంలోకి దిగారు. పనుల్లో పాల్గొని చదును పనులను పర్యవేక్షిస్తూ పార పట్టి దగ్గరుండి చదును చేసిన రామానాయుడు. దీనికి తోడు అధికారుల సమన్వయంతో ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేశారు.
మహానాడు వేడుకల్లో భాగంగా టీడీపీ జెండాలు, తోరణాలు, భారీ ఫ్లెక్సీలతో సభా ప్రాంగణం పసుపుమయంగా మారింది. రాయలసీమలో తొలిసారిగా నిర్వహించబడుతున్న ఈ మహానాడు, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా సాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కడపకు రానుండగా, రేపు ఉదయం 8:30 గంటలకు ప్రతినిధుల నమోదుతో మహానాడు అధికారికంగా ప్రారంభం కానుంది.
రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేకంగా రూపొందించనున్న “రాయలసీమ డిక్లరేషన్”పై ఈ మహానాడులో ప్రధానంగా చర్చ జరగనుండటం గమనార్హం. ఈ నెల 29న జరగబోయే బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి 5 లక్షల మందికిపైగా హాజరయ్యే అవకాశం ఉంది.
ఈ మహానాడు ద్వారా రాయలసీమ ప్రాంతానికి రాజకీయంగా, అభివృద్ధి పరంగా ఒక కొత్త దిశలో సాగుదల అవుతుందనే నమ్మకంతో టీడీపీ శ్రేణులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు