Nara Lokesh: శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ హైస్కూల్‌లో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ (Mega PTM 2.0) గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ…
ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్ బడులకు ఏ మాత్రం తీసిపోకుండా తీర్చిదిద్దుతున్నాం. చదువుతో పాటు పాటలు, ఆటలు, యోగా కూడా బోధిస్తున్నారు అన్నారు.
పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది గురువులే. మన గురువులు విద్య మాత్రమే కాదు, జీవిత పాఠాలు కూడా నేర్పుతారు. తల్లి మాత్రం జీవితంలో మొదటి గురువు. నడక, బాధ్యత, మానవత్వం అన్నీ తల్లే నేర్పుతుంది అన్నారు.
తల్లికి గౌరవం చెప్పడానికి తల్లికి వందనం అంటూ మంచి కార్యక్రమం పెట్టాం. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు అద్భుతంగా రాణిస్తున్నారు. షైనింగ్ స్టార్స్ ద్వారా పేద పిల్లలకు సహాయం అందించాం అని వివరించారు.
ఇది కూడా చదవండి: Raghunandan Rao: ఇందిరమ్మ ఇండ్లపై సీఎంకు ఎంపీ రఘునందన్‌రావు లేఖ
మునుపటి ప్రభుత్వం విద్యవ్యవస్థను బలహీనంగా మార్చింది. నాణ్యత లేని యూనిఫాంలు ఇచ్చారు. కానీ ఇప్పుడు విద్యాశాఖ ద్వారా మంచి మార్పులు తీసుకొస్తున్నాం అన్నారు.
ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు తల్లిపేరు మీద ఒక మొక్క నాటండి అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోటి మొక్కలు నాటాలని సవాల్ విసరడంతో, ‘‘ఆ సవాల్‌ను నేనూ స్వీకరిస్తున్నా. విద్యాశాఖ ద్వారా కోటి మొక్కలు నాటిస్తాం” అని లోకేష్ ప్రకటించారు.
సోషల్ టీచర్ గా మారిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు..
“వనరులు” అనే టాపిక్ పై పిల్లలకు పాఠాలు. #MegaParentTeacherMeeting#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#NaraLokesh pic.twitter.com/Hc8Mb6Jpgp
— Telugu Desam Party (@JaiTDP) July 10, 2025