NC24

NC24: మిస్టిక్ థ్రిల్లర్ గా NC24.. పనులు స్టార్ట్!

NC24: అక్కినేని నాగచైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘తండేల్’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. రాజు పాత్రలో రఫ్ లుక్‌తో అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో అభిమానులను ఆకట్టుకున్న చైతూ, ఇప్పుడు తన తదుపరి చిత్రంతో మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు. దర్శకుడు కార్తిక్ దండు డైరెక్షన్‌లో రూపొందుతోన్న ఈ మిస్టిక్ థ్రిల్లర్ మూవీ, చైతూ కెరీర్‌లో 24వ చిత్రంగా తెరకెక్కుతోంది. NC24 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది.

ఈ చిత్రం కోసం నాగచైతన్య సరికొత్త స్టైలిష్, ట్రెండీ లుక్‌లోకి మారి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమా, చైతూ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని టాక్. గతంలో అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మిస్టిక్ థ్రిల్లర్‌లో చైతూ నటన, కథాంశం ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. మరోవైపు, ‘తండేల్’ విజయంతో జోష్‌లో ఉన్న చైతూ, ఈ సినిమాతో మరో హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mlc election: తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ, బీజేపీ అభ్యర్థుల ఘన విజయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *