Problem With Bread: ఈ రోజుల్లో బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్ అనేది కామన్ గా మారింది. టీ, కాఫీలతో పాటు బ్రెడ్ జామ్, బ్రెడ్ ఆమ్లెట్ ఇలా ఏదో ఒక విధంగా ఉదయం బ్రెడ్ తింటారు చాలా మంది. ప్రధానంగా చిన్న పిల్లలకు కూడా దీన్ని తినిపిస్తున్నారు. ఎందుకంటే దీన్ని వండాల్సిన పనిలేదు. కొద్దిగా తీసుకుంటే కడుపు నిండుతుంది. ఈ కారణాల వల్ల చాలా మంది ఉదయాన్నే బ్రెడ్ తింటారు. రోజు బ్రెడ్ తింటే ఏమవుతుందో తెలుసా?
బరువు పెరుగుతారు
బ్రెడ్ తినేవారు బరువు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బ్రెడ్‌లో చక్కెర, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ శరీర బరువును పెంచుతాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ తింటే బరువు పెరుగుతారు. ఒకసారి బరువు పెరిగితే దాన్ని నియంత్రించడం అంత సులభం కాదు.
బ్లడ్ షుగర్ పెరుగుతుంది
బ్రెడ్‌లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇవి తింటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. మీరు రోజూ బ్రెడ్ తింటే రక్తంలో చక్కెర స్థాయి విపరీతంగా పెరుగుతుంది. షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు బ్రెడ్ తినకూడదు.
కడుపు సమస్యలు
పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే పొట్ట సమస్యలు దరిచేరవు. జీర్ణక్రియ కూడా బాగా జరుగుతుంది. కానీ బ్రెడ్ లో ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని తింటే జీర్ణ సమస్యలు పెరుగుతాయి. ఎందుకంటే మైదా పిండితో తయారుచేసిన బ్రెడ్ పేగులకు అంటుకుంటుంది. త్వరగా జీర్ణం కాదు. తద్వారా జీర్ణ సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా వస్తాయి.
గుండెకు ప్రమాదం
బ్రెడ్‌లో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ తింటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తృణధాన్యాలు తినాలి
ఆరోగ్యంగా ఉండాలంటే బ్రెడ్‌కు బదులుగా క్వినోవా, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి ధాన్యాలు తినవచ్చు. ఎందుకంటే వాటిలో పోషకాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి తింటే ఆరోగ్యం బాగుంటుంది.
తక్కువగా తినాలి
బ్రెడ్ పరిమితంగా తింటే సమస్యలు ఉండవ్. కూరగాయలు, పండ్లతో బ్రెడ్ తినవచ్చు. ఇలా తింటే శరీరానికి పోషకాలు, పీచు పదార్థాలు అందుతాయి. బ్రెడ్‌కు బదులుగా బాదం, వాల్‌నట్స్, చియా సీడ్స్ వంటి నట్స్ తినండి. వీటిలో వివిధ రకాల విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.