IPL 2025

IPL 2025: ముంబై ఇండియన్స్ అభిమానులకు చేదు వార్త..! ఏరి కోరి కొనుక్కున్న ఆ విదేశీ ప్లేయర్ ఐపీఎల్ కు దూరం..!

IPL 2025: 2025 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే ముంబయి ఇండియన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గత సంవత్సరం మెగా వేలంలో రూ.4.80 కోట్లకు కొనుగోలు చేసిన ఆఫ్గానిస్థాన్ యువ స్పిన్నర్ అల్లాగ్ గజన్‌ఫర్ గాయపడ్డాడు. జింబాబ్వే పర్యటనలో వెన్నుముకకు గాయం కారణంగా, అతడు ఛాంపియన్స్ ట్రోఫీ మరియు 2025 ఐపీఎల్ సీజన్ అంతా దూరం కానున్నాడని అఫ్గాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

గత సీజన్లో ప్లేఆఫ్‌లకు చేరలేకపోయిన ముంబయి, ఈ సారి టైటిల్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్లు జట్టును సిద్ధం చేసింది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి మేటి ప్లేయర్లతో ప్రతిష్టంగా ఉన్న ఈ జట్టులోకి ఇప్పుడు విల్ జాక్స్ మరియు ర్యాన్ రికిల్ టన్ కూడా వచ్చి చేరారు బౌలింగ్ విభాగంలో కూడా బుమ్రాకి తోడుగా ట్రెంట్ బౌల్ట్ కొనుగోలు చేశారు ముంబై.

దీనితో ఈసారి తమ చెట్టు ప్లే ఆఫ్ కన్ఫర్మ్ అని ఫిక్స్ అయిపోయిన ముంబై అభిమానులు ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. గజన్‌ఫర్ గాయం ముంబయి యాజమాన్యం మరియు అభిమానులను ఆందోళనకు గురిచేసింది.

Also Read: Viral Video: వేగంగా వస్తున్న రైలు.. పట్టాలకు అడ్డుగా కారు.. కట్ చేస్తే ఏమి జరిగిందో తెలియాలంటే వీడియో చూడాల్సిందే!

ఇందుకు కారణం ఏమిటంటే ఎన్నో ఏళ్లుగా ముంబై స్పిన్ విభాగంలో తడబడుతోంది. గత సీజన్ లో పాడిన పీయూష్ చావ్లా ఈసారి అందుబాటులో ఉండడు. గతంలో రాహుల్ చాహార్, కృనాల్ పాండ్యా పరవాలేదు అనిపించేవారు కానీ ఇప్పుడు వారు కూడా లేరు.

దీంతో ఈ చెట్టు తమ స్పిన్ విభాగం ఆశలన్నీ ఈ యువ ఆఫ్ ఖాన్ ప్రేయర్ పైనే పెట్టుకుంది. గజన్‌ఫర్ దేశవాళీలో రాణించి, అంతర్జాతీయ స్థాయిలోనూ తన ప్రతిభను చాటుకున్నాడు. 11 వన్డేల్లో 21 వికెట్లు పడగొట్టి, ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్థానం సాధించాడు. కానీ, గాయం వల్ల ఈ అవకాశం నష్టపోయింది. అతని స్థానంలో నంగ్యాల్ కరోటిని అఫ్గాన్ జట్టులో ఎంపిక చేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Sharwanand: భారీ రిస్క్ తీసుకున్న శర్వానంద్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *