Viral Video

Viral Video: వేగంగా వస్తున్న రైలు.. పట్టాలకు అడ్డుగా కారు.. కట్ చేస్తే ఏమి జరిగిందో తెలియాలంటే వీడియో చూడాల్సిందే!

Viral Video: రైల్వే లెవల్ క్రాసింగ్ దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే మామూలుగా ఉండదు. గేటు పడితే ఆగిపోకుండా ముందుకు వెళితే జరిగే ప్రమాదం ఎంత బీభత్సంగా ఉంటుందో చెప్పలేం. సరిగ్గా అలాంటి సంఘటనే అమెరికాలో చోటు చేసుకుంది. ఆ ప్రమాదం వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వేగంగా వస్తున్న రైలు.. పట్టాలపై ఆగిపోయిన కారును ఢీ కొట్టడం వీడియోలో చూస్తే కళ్ళు తిరిగేలా సన్నివేశం ఉంది.

అమెరికాలోని ఉతాలోని లేటన్‌లో ఈ ఘటన జరిగింది. అక్కడ ఒక గేటు వద్ద రైలు వస్తున్న సూచనగా గేటు వేశారు. సరిగ్గా గేటు పడుతున్న సమయంలో ఒక కారు వేగంగా గేటును దాటి ముందుకు వెళ్ళింది. అక్కడ రెండు ట్రాక్స్ ఉన్నాయి. కారు మొదటి ట్రాక్ దాటే సమయంలో రెండోవైపు గేటు మూసి ఉండడంతో కారును వెనక్కి నడిపాడు డ్రైవర్. అయితే, వెనుక గేటు ఉండడంతో కారు గేటును ఢీకొట్టి ఆగిపోయింది. అయితే, ఈలోపు వేగంగా రైలు దూసుకు వచ్చింది. రైలు వేగంగా రావడం గమనించిన డ్రైవర్ కారు డోరు తెరుచుకుని కిందకు దిగి పక్కకు వెళ్ళిపోయాడు. దీంతో వేగంగా వచ్చిన రైలు కారును ఢీ కొట్టింది. ఎంతలా అంటే, కారు పూర్తిగా యూ టర్న్ అయి పక్కనే ఉన్న సిగ్నల్ స్తంభాన్ని వేగంగా ఢీ కొట్టేలా. ఆ దెబ్బకి ఆ స్తంభం పూర్తిగా ఎగిరిపడింది. కారు మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది.

Also Read: Hyderabad: మీ సేవలపై దండయాత్ర.. ఇంతమంది వెళ్తున్నారెంట్రా బాబు..

వీడియోలో ఆ సీన్ చూస్తే హార్ట్ ఎటాక్ ఉన్నవాళ్ళకి మళ్ళీ ఆసుపత్రి అవసరం పడుతుంది. ఒకవేళ హార్ట్ ఎటాక్ లేకపోతే దెబ్బకి గుండె జబ్బు గ్యారెంటీగా వచ్చేస్తుంది. బీభత్సమైన ఆ ఏక్సిడెంట్ వీడియోలో చూసిన నెటిజన్లు హడలి పోతున్నారు. వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.

రైల్వే క్రాసింగ్ దగ్గర జాగ్రత్తగా ఉండాలని కొందరు కామెంట్ చేస్తే.. యాక్సిడెంట్ నుంచి సెకన్ల వ్యవధిలో బయట పడ్డ డ్రైవర్ ను అదృష్టవంతుడు అంటూ పేర్కొంటున్నారు. అసలు డ్రైవర్ కారును ముందుకు తీసుకువెళితే ఆ ప్రమాదం జరిగేది కాదని అందరూ అభిప్రాయపడుతున్నారు. వాస్తవం కూడా అదే. కారును పట్టాలు దాటించి మధ్యలో ఉన్న రోడ్డుపైకి చేర్చి ఉంటె ప్రమాదం జరిగేది కాదు అనే విషయం వీడియో చూసిన వారికి స్పష్టంగా అర్ధం అవుతుంది.

ఈ వీడియోను 9 మిళియన్లకు పైగా ఇప్పటీకే చూశారు.

కానీ, ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఆ ప్రమాదం కారు డ్రైవర్ అజాగ్రత్త వలన జరగలేదు. వెనుక వస్తున్న ఒక ట్రక్ ఆ కారును ఢీ కొట్టింది. దీంతో కారు ముందుకు పుష్ అయింది. కారు బ్రేకులు పట్టేశాయి. రివర్స్ గేరులో కారు కొంచెమే వెనక్కి వెళ్లి ఆగిపోయింది. అయితే, ఆ కారు డ్రైవర్ కారు దిగింది కూడా ట్రైన్ వస్తుందనే టెన్షన్ తో కాదు. తన కారును ఢీ కొట్టిన ట్రక్ డ్రైవర్ తో గొడవపడటానికి. వీడియో మొదటి నుంచి జాగ్రత్తగా చూస్తే ఈ విషయం అర్ధం అవుతుంది. ఇదే విషయాన్ని పలువురు కామెంట్స్ రూపంలో తెలియచేస్తున్నారు.

ALSO READ  Robotic Elephant: ఆలయంలో రోబో ఏనుగు విన్యాసాలు – తొండంతో భక్తులకు ఆశీర్వాదం!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *