Health Tips

Health Tips: ఈ పండ్లతో ‘స్లిమ్​గా మారొచ్చు

Health Tips: ఆధునిక యుగంలో చాలా మందికి బరువు పెరగడం అనేది పెద్ద సమస్యగా మారింది. అందుకే బరువు తగ్గడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది ఈజీగా అనిపించినప్పటికీ ఇదొక సాహసం. జిమ్, యోగా, డైట్ వంటి అనేక వర్కవుట్లు చేస్తూ కొందరు చెమటలు చిందిస్తారు. మరికొందరు ఫుడ్ డైట్​ను పాటిస్తారు. అయితే ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్న విధంగా వెయిట్ లాస్ కాకపోవడంతో నిరాశ చెందుతారు. కానీ బరువు తగ్గడంలో పండ్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. అయితే సరైన సమయంలో పండ్లు తింటేనే పూర్తి ప్రయోజనాలు పొందవచ్చు. బరువు తగ్గడానికి పండ్లను ఏ టైమ్​లో తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పండ్ల ప్రాముఖ్యత
Health Tips: పండ్లు..విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు వంటి అవసరమైన పోషకాల యొక్క పవర్‌హౌస్. పండ్లలో ఉండే అధిక ఫైబర్ ఆకలిని నియంత్రిస్తుంది. దీని వల్ల ఆహారాన్ని తక్కువగా తినడంతో బరువు తగ్గడానికి అవకాశం

ఇది కూడా చదవండి: Tirumala: తిరుమల దర్శనాల కోసం ఏకంగా హోమ్ మంత్రినే వాడేశాడు.. చివరికి ఏమైందంటే..

బరువు తగ్గడానికి పండ్లు ఎప్పుడు తినాలి?
Health Tips: పండ్లు తినడానికి ఉత్తమ టైమ్ అనేది వ్యక్తిగత అలవాట్లు, ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. కానీ వీటిని స్నాక్స్‌గా లేదా భోజనానికి ముందు తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. భోజనం తర్వాత పండ్లు తినడం వల్ల శరీరానికి కార్బోహైడ్రేట్ కంటెంట్‌ అందుతుంది. పండ్లను ఎప్పుడు తినాలనేది రూల్ ఏమిలేదు. పండ్లను ఉదయం లేదా సాయంత్రం స్నాక్‌గా తీసుకోవడం ద్వారా శక్తి స్థాయిలను స్థిరంగా ఉంచుకోవచ్చు. పెరుగు, మొలకలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలతో పండ్లను కలిపి తినడం వల్ల అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

ఇది కూడా చదవండి: Droupadi Murmu: మంగ‌ళ‌గిరికి రాష్ట్ర‌ప‌తి ముర్ము

బరువు తగ్గడానికి ఏ పండ్లు తినాలి?
Health Tips: యాపిల్స్, బేరి, నారింజ,బెర్రీలు వంటి ఫైబర్ అధికంగా ఉండే పండ్లను తినడం వల్ల బరువును ఈజీగా తగ్గొచ్చు. మరోవైపు పుచ్చకాయ, అరటి, మామిడి, సపోటా వంటి పండ్లు అధిక గ్లైసెమిక్​ను కలిగి ఉంటాయి. ముఖ్యంగా బీపీ, షుగర్ ఉన్నవారు ఈ పండ్లను తక్కువగా తీసుకోవడం చాలా మంచిది
బరువు కంట్రోల్ చేసేందుకు పండ్ల రసం కంటే పండ్లను తినడమే బెటర్. ఎందుకంటే పండ్లను డైరెక్ట్​గా తినడం వల్ల ఫైబర్ కంటెంట్ ఎక్కువ లభిస్తుంది. ఇది ఆకలిని అరికట్టడంలో సహాయపడుతుంది

ALSO READ  Srisailam Dam: ప్రమాదంలో శ్రీశైలం డ్యాం.. వెంటనే మరమ్మతులు చేయాలి

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *