Thug Life

Thug Life: కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ వివాదం: శివరాజ్ కుమార్ పై విమర్శలు!

Thug Life: పాన్ ఇండియా సినిమా ‘థగ్ లైఫ్’లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా, త్రిష, అభిరామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రిలీజ్ దగ్గర పడుతుండగా, అనూహ్య వివాదాలు తలెత్తాయి. కమల్ హాసన్ కన్నడ భాష తమిళం నుంచే ఉద్భవించిందని చేసిన వ్యాఖ్యలు కన్నడ ప్రేక్షకులను ఆగ్రహానికి గురిచేశాయి. ఈ వ్యాఖ్యలపై కమల్ స్పష్టతనిస్తూ, తనలో తప్పు లేదని, క్షమాపణ చెప్పనని, కన్నడలో బ్యాన్ చేసినా భయపడనని గట్టిగా చెప్పారు.

Also Read: Lal Salaam: సంవత్సరం తరువాత ఓటిటిలోకి సూపర్ స్టార్ డిజాస్టర్ సినిమా!

Thug Life: ఈ వివాదం మరింత ముదిరింది. ఇక సినిమా ఈవెంట్‌లో కన్నడ నటుడు శివ రాజ్ కుమార్, కమల్‌ను తండ్రితో పోల్చుతూ, కన్నడ ప్రేక్షకులు ఇతర భాషా సినిమాలు చూడరా అని ప్రశ్నించడం విమర్శలకు దారితీసింది. ఈ గొడవ సినిమా రిలీజ్ సమయంలో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *