Lal Salaam

Lal Salaam: సంవత్సరం తరువాత ఓటిటిలోకి సూపర్ స్టార్ డిజాస్టర్ సినిమా!

Lal Salaam: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘లాల్ సలాం’ సినిమా ఎట్టకేలకు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గత ఏడాది థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, దాదాపు 16 నెలల తర్వాత సన్ నెక్స్ట్ ఓటీటీ వేదికపై జూన్ 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సాధారణంగా సినిమాలు నెల రోజుల్లోనే ఓటీటీలోకి వస్తుండగా, ఈ మూవీ ఆలస్యానికి కొన్ని వివాదాస్పద ప్రచారాలే కారణమని టాక్.

Also Read: Opal Suchata Chuangsri: రొమ్ము క్యాన్సర్‌ను ఓడించి మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న థాయిలాండ్ బ్యూటీ!

Lal Salaam: విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో రజినీ మొయినుద్దీన్ అనే కీలక పాత్రలో మెరిశారు. రజినీ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆమె తండ్రి కోసం చేసిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్. అయితే, రిలీజ్ తర్వాత కొందరు ఫ్యాన్స్ ఈ చిత్రం రజినీ స్థాయికి తగ్గదని విమర్శించారు. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతున్న ఈ సినిమా, సూపర్ స్టార్ అభిమానులకు మరోసారి రజినీ మ్యాజిక్‌ను అందించనుంది. మరి, ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *