Hyderabad: హైదరాబాద్ హుస్సేన్ సాగర్ సరస్సులో చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. బోట్లో ఉన్న బాణాసంచా ఒక్కసారిగా పేలడంతో బోటు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన సమయంలో బోటులో ఉన్నవారి పరిస్థితి ఇంకా స్పష్టతకు రాలేదు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రయాణికుల ప్రాణనష్టం ఉందా అనే విషయంపై ఇంకా సమాచారం అందాల్సి ఉంది.
ఈ ప్రమాదం హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఉన్నవారిని భయాందోళనకు గురిచేసింది. అధికారులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.