Mahindra Thar

Mahindra Thar: మహీంద్రా థార్ సరికొత్త రూపంలో.. ఆకర్షణీయమైన ఆఫర్లతో వచ్చేసింది !

Mahindra Thar: మహీంద్రా కంపెనీ ఇటీవలే థార్ రాక్స్ 5 డోర్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త కారు లాంచ్ తర్వాత 3 డోర్ ఫెసిలిటీ థార్‌పై ఉత్తమ ఆఫర్‌లను ప్రకటించింది.

మిడిల్ వారెంట్ SUVల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న మహీంద్రా ఇటీవల 5-డోర్ల థార్ రాక్స్‌ను లాంచ్ చేసింద. కొత్త కారును విడుదల చేసిన తర్వాత, 3-డోర్ల థార్ కొనుగోలుపై గొప్ప ఆఫర్‌ అందిస్తోంది. కొత్త సదుపాయాలతో థార్ రాక్స్‌కు భారీ డిమాండ్ రావడంతో థార్‌కు డిమాండ్ కాస్త తగ్గుముఖం పడుతోంది. దీంతో కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ఆఫర్లను మహీంద్రా అందిస్తోంది.

Mahindra Thar:  కొత్త ఆఫర్లలో, మహీంద్రా కంపెనీ థార్ రూ. 1.50 లక్షలు. కొత్త ఆఫర్లలో ఎక్స్ఛేంజ్, క్యాష్ బ్యాక్, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. కొత్త ఆఫర్‌లు థార్ యొక్క ఎంట్రీ-లెవల్ పెట్రోల్ మాన్యువల్ , డీజిల్ మాన్యువల్ మోడళ్లపై ఎక్కువగా ఉన్నాయి.ఇది రాబోయే పండుగ సీజన్‌లో కారును కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుంది.

థార్ 3-డోర్ మోడల్ ప్రస్తుతం మార్కెట్‌లో 1.5-లీటర్ డీజిల్, 2.0-లీటర్ టర్బో పెట్రోల్ , 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ తో రూ.11.35 లక్షల నుండి రూ. 17.60 లక్షల వరకు ధర పలుకుతోంది. ఫోర్స్ గూర్ఖా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న థార్ కారుకు బలమైన పోటీ ఇస్తోంది. దీంతో ఇది కస్టమర్‌లను తెగ అట్రాక్ట్ చేస్తోంది.

Mahindra Thar:  లైఫ్ స్టైల్, ఆఫ్-రోడ్ ఫ్రెండ్లీగా అందుబాటులోకి వచ్చిన థార్ అనేక ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంది. అంతే కాకుండా ఇది యువ కస్టమర్లకు ఇష్టమైన SUV మోడల్. కానీ 3-డోర్ల సదుపాయం కారణంగా, ఇది కుటుంబంతో ప్రయాణించే వినియోగదారులను ఆకర్షించడంలో ఫేయిల్ అయ్యింది. ఈ కారణంగానే థార్ రాక్స్ కొత్త మోడల్ 5-డోర్లతో ప్రారంభించబడింది.

అదనంగా, కొత్త థార్ రాక్స్ కారులో ADAS భద్రతా వ్యవస్థ, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సన్ రూఫ్, ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్, ప్రీమియం ఆడియో సిస్టమ్, థార్ మోడల్‌లో లేని కీలెస్ స్టార్ట్/స్టాప్ సౌకర్యాలు ఉన్నాయి. దీంతో పాటు, థార్ మోడల్ కూడా అనేక లక్షణాలను కలిగి ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Enfield EV: బ్యాటరీ బుల్లెట్ బండి వచ్చేస్తోంది.. ఈవీ బైక్ ల లెక్క మారినట్టే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *