Hardik Pandya

Hardik Pandya: ఇదెక్కడి ఊచకోత.. 6,6,6,4,6.. 21 ఏళ్ల బౌలర్‌ కెరీర్‌కు ముగింపు పలికిన హార్దిక్ పాండ్యా..!

Hardik Pandya: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హార్దిక్ పాండ్యా ఒకదాని తర్వాత ఒకటి తుఫాన్ ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోతున్నాడు. బరోడా, త్రిపుర మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ పాండ్యా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో అతను 21 ఏళ్ల బౌలర్ వేసిన ఓవర్‌లో 28 పరుగులతో బీభత్సం సృష్టించాడు.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. అతని బ్యాట్‌ నుంచి ఒకదాని తర్వాత ఒకటి తుఫాన్ ఇన్నింగ్స్‌లు వస్తున్నాయి. ఇది టీమిండియాకు శుభ పరిణామంగా మారింది. బరోడా జట్టుకు ఆడుతున్న హార్దిక్ పాండ్యా ఈ టోర్నీలో బౌలర్లకు విపత్తుగా మారాడు. త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో కూడా హార్దిక్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను ఎడమ చేతి స్పిన్నర్ పర్వేజ్ సుల్తాన్‌ను చితక్కొట్టాడు. ఒకే ఓవర్‌లో ఫోర్లు, సిక్స్‌ల వర్షం కురిపించాడు.

ఇది కూడా చదవండి: AB de Villiers on RCB: ఆర్‌సీబీలో లోపం అదే.. ట్రోఫీపై బిగ్ ఎఫెక్ట్

Hardik Pandya: అంతకుముందు తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా కూడా ఇలాంటి ఫీట్‌తో ఆకట్టుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ గుర్జాప్‌నీత్ సింగ్‌పై హార్దిక్ పాండ్యా ఒక ఓవర్‌లో 29 పరుగులు చేశాడు. గుర్జప్‌నీత్ సింగ్ వేసిన ఓవర్ తొలి 3 బంతుల్లో 3 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత గుర్జప్‌నీత్‌ సింగ్‌ బౌలింగ్‌లో నో బాల్‌ వేశాడు. ఆపై పాండ్యా నాలుగో బంతికి సిక్స్, ఐదో బంతికి ఫోర్ బాదాడు. అదే సమయంలో, ఓవర్ చివరి బంతికి 1 పరుగు వచ్చింది. 26 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ సీమర్ గుర్జాపనీత్ సింగ్ IPL వేలం సమయంలో వెలుగులోకి వచ్చాడు. అక్కడ CSK అతన్ని రూ. 2.20 కోట్లకు కొనుగోలు చేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Honeytrap: వామ్మో పనిమనిషి.. హనీట్రాప్.. నాలుగు కోట్ల దోపిడీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *