Health Tips

Health Tips: చలికాలంలో చర్మం, జుట్టు సమస్యలకు ఈ నూనెతో చెక్

Health Tips: చలికాలలో వాతావరణం చల్లగా ఉండడం వల్ల చర్మంలోని తేమ త్వరగా ఆరిపోతుంది. ఇది డ్రై స్కిన్ సమస్యకు దారితీస్తుంది. అలాగే పొడి జుట్టు, స్ప్లిట్ హెయిర్, చుండ్రు సహా ఇతర జుట్టు సమస్యలు కూడా ఎదురవుతాయి. కాబట్టి చలికాలంలో చర్మ సంరక్షణతో పాటు జుట్టు రక్షణ కూడా చాలా ముఖ్యం. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే చలికాలంలో వీటిలో కొన్ని మార్పులు చేసుకోవడం అవసరం. ఈ సమస్యలకు మస్టర్డ్ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది. చలికాలం సమస్యల నుండి మీ చర్మం, జుట్టును రక్షించడంలో ఆవాల నూనె ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆవాల నూనె లాభాలు: స్టోర్‌లో కొనుగోలు చేసే మాయిశ్చరైజర్‌ల వాడకం వల్ల మనకు కొన్ని లాభాలు ఉన్నప్పటికీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కానీ కొన్ని సహజ ఉత్పత్తులు మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది చర్మానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. కాబట్టి చర్మ సమస్యలకు సహజసిద్ధమైన ఉత్పత్తులను ఉపయోగించడం మంచిది. నిజానికి ఆవాల నూనె చర్మం, జుట్టుకు లోతైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. అదేవిధంగా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: Health Tips: నేలపై కూర్చొని భోజనం చేస్తే ఇన్ని లాభాలా!

చర్మాన్ని తేమగా ఉంచుతుంది: మస్టర్డ్ ఆయిల్, సహజ లిపిడ్‌లతో సమృద్ధిగా ఉంటుంది. చర్మానికి డీప్ హైడ్రేషన్ అందిస్తుంది. పొడిబారకుండా తెల్లటి పాచెస్‌ను తొలగిస్తుంది.

జుట్టును బలపరుస్తుంది: ఆవాల నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టుకు అవసరమైన పోషణ లభిస్తుంది. చుండ్రు సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా చలికాలంలో పొడిబారడం వల్ల తరచూ జుట్టు పగలకుండా ఆవనూనె నివారిస్తుంది.

పగిలిన మడమలను నివారిస్తుంది: మడమలు, పెదవులు పగులకుండా చేస్తుంది. ఆవాల నూనెను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల మడమలు పగిలడం, పెదాలు పొడిబారడాన్ని నిరోధిస్తుంది. ఇది పాదాలు, పెదాలలో తేమ ఉండేలా చేసి పొడిబారకుండా కాపాడుతుంది.

ఇది కూడా చదవండి: Wife and Husband: భార్యాభర్తల మధ్య ఏజ్​ గ్యాప్ ఎంత ఉండాలి..?

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది: ఆవనూనెతో మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచి, చల్లని వాతావరణంలో శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంది. నేచురల్ గ్లో: చర్మానికి ఆవాల నూనెను రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా మీరు ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని పొందుతారు.

ALSO READ  Narne Nithin: పెళ్ళిపీటలెక్కబోతున్న ఎన్టీఆర్ బావమరిది

స్కిన్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది: ఆవనూనెలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. కాబట్టి చలికాలంలో చర్మ సమస్యల నుండి సురక్షితంగా ఉండటానికి ఆవాల నూనెను క్రమం తప్పకుండా వాడండి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *