Hydrogen Train: దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. హర్యానా రాష్ట్రంలోని జింద్- సోనిపట్ స్టేషన్ల మధ్య దీనిని ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ప్రపంచంలోనే జర్మనీలో మాత్రమే ప్రస్తుతం హైడ్రోజన్ రైలు నడుస్తున్నది. ఆ తర్వాత మన దేశంలోనే నడువనున్నది. దీంతో ప్రపంచంలోనే ప్రత్యేకత కలిగిన భారతీయ రైల్వే సంస్థ మరో ఘనతను సాధించనున్నది.
8 కోచ్‌లు ఉండే ఈ హైడ్రోజన్ రైలులో 2,638 మంది ప్రయాణం చేసే అవకాశం ఉన్నది. ఈ రైలు గరిష్ఠ వేగం గంటకు 110 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రైలు డిజైన్‌ను ఆర్‌డీఎస్‌వో రూపొందించింది. ప్రస్తుతం దీనిని నమో గ్రీన్ రైలుగా పిలుస్తున్నారు. ట్రయల్ రన్ అనంతరం దానిని మరింత దూరం పొడిగిస్తారు. విజయవంతంగా నడిస్తే ఇతర రైళ్లను ప్రవేశపెట్టి మరింతగా విస్తరించే అవకాశం ఉన్నది.