Akhil-6 : అక్కినేని అఖిల్ తన కెరీర్‌లో 6వ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఏప్రిల్ 8న విడుదల కానుందని తాజా సమాచారం. అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ అప్‌డేట్‌ను అభిమానులకు కానుకగా అందించాలని చిత్ర బృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ‘లెనిన్’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోందని టాక్.
దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తుండగా, శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.చివరిసారి ‘ఏజెంట్’ సినిమాతో నిరాశపరిచిన అఖిల్, ఈసారి భారీ హిట్ కోసం పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగాడు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం అఖిల్ కొత్త లుక్‌లో కనిపించనున్నాడని సమాచారం. ఫస్ట్ లుక్‌తోనే అభిమానుల్లో జోష్ నింపాలని మేకర్స్ భావిస్తున్నారు.
Also Read: Sreeleela: శ్రీలీలపై అభిమానుల అత్యుత్సాహం.. ప్రమోషన్ ఈవెంట్‌లో షాకింగ్ ఘటన!
Akhil-6 : షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైనప్పటికీ, ఇప్పటివరకు అప్‌డేట్స్ రాకపోవడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో అఖిల్ తన కెరీర్‌లో కొత్త టర్న్ తీసుకోవాలని ఆశిస్తున్నాడు. గతంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో మంచి విజయం సాధించిన అతడు, ఈసారి మరో బ్లాక్‌బస్టర్ కొట్టాలని చూస్తున్నాడు. ఏప్రిల్ 8న విడుదలయ్యే ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ అఖిల్ ఫ్యాన్స్‌కు పండగ వాతావరణం తెస్తాయని ఆశిద్దాం!