iPhone SE 4

iPhone SE 4: చౌకైన ఐఫోన్ రాబోతోంది.. స్పెషిఫికేషన్స్ లీక్ అయ్యాయి..

iPhone SE 4: ప్రస్తుతం Apple కొత్త iPhone SE 4 పై పని చేస్తోంది. దీనిని Apple డేటాబేస్లో లిస్ట్ చేశారు. కంపెనీ వచ్చే ఏడాది ఈ ఫోన్‌ని తీసుకురావచ్చు. తక్కువధరలో ఐఫోన్ అందించడం కోసం ఈ ఫోన్ లో 48MP ప్రైమరీ కెమెరా, తాజా A18 బయోనిక్ చిప్‌సెట్‌ను అందించనున్నారు. అలాగే, దీని డిజైన్ ఐఫోన్ 14 లాగా ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా తన అత్యంత అధునాతన ఐఫోన్ 16 సిరీస్‌ను ప్రారంభించిన తర్వాత, ఆపిల్ అనేక కొత్త ప్రోడక్ట్స్ పై పని చేయడం ప్రారంభించింది. వీటిలో ఒకటి iPhone SE 4. దీనిపై కంపెనీ పనిచేస్తోందని సమాచారం. ఇతర ఐఫోన్‌లతో పోలిస్తే ఇది తక్కువ ధర రేంజిలో విడుదల చేస్తారని భావిస్తున్నారు. లాంచ్‌కు ముందే దీని గురించి చాలా సమాచారం వెల్లడైంది.

ఐఫోన్ SE మునుపటి వేరియంట్‌ను 2022లో ఆపిల్ పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల రిపోర్ట్స్ ప్రకారం iPhone SE 4 దాదాపుగా iPhone 14ని పోలి ఉండవచ్చని సూచిస్తున్నాయి. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన వెలుగులోకి వచ్చిన వివరాలు తెలుసుకుందాం.

వచ్చే ఏడాది ఎంట్రీ ఉంటుందా?

ఈ సంవత్సరం తరువాత Apple iPhone SE 4 భారీ ఉత్పత్తిని ప్రారంభించవచ్చని అనేక నివేదికలు సూచిస్తున్నాయి. ఇది దాదాపు డిసెంబర్‌లో జరగొచ్చని భావిస్తున్నారు. iPhone SE 4 అధికారికంగా ఏప్రిల్ 2025లో రావచ్చని చెప్పబడింది. గుర్తుంచుకోండి, ఆపిల్ దీనికి సంబంధించి అధికారికంగా ఏమీ చెప్పలేదు. అయితే దీనికి సంబంధించి అనేక కథనాలు వెలువడ్డాయి.

డేటాబేస్లో లిస్ట్ అయింది..

ఈ హ్యాండ్ సెట్ వివరాలు Apple డేటాబేస్‌లో V59 అనే కోడ్‌నేమ్‌తో లిస్ట్ అయింది. ఇటీవల, ఒక టిప్‌స్టర్ అంచనా ప్రకారం iPhone SE (2025) ఇమేజిని సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ ఇమేజ్ దాని వెనుక ప్యానెల్‌ను చూపిస్తోంది. ఇది ఐఫోన్ 7 ప్లస్ డిజైన్‌ను పోలి ఉంటుంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.

48MP ప్రైమరీ కెమెరా సెటప్

స్పెసిఫికేషన్ల పరంగా, iPhone SE 4 6.6-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని, ఈ సిరీస్‌లో 48MP కెమెరాను కలిగి ఉన్న మొదటి మోడల్ ఇదే కావచ్చు. OLED డిస్ప్లే 60Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది.

A18 బయోనిక్ చిప్‌సెట్ లభిస్తుంది

కొత్త iPhone SE4 పనితీరు కోసం సరికొత్త A18 బయోనిక్ చిప్‌సెట్‌ను పొందవచ్చు. ఇది 8GB LPDDR5 ర్యామ్‌కు సపోర్ట్ చేస్తుంది. స్టోరేజ్ ఆప్షన్‌లలో 128GB, 256GB మరియు 512GB వేరియంట్‌లు ఉంటాయి. మునుపటి తరం ఐఫోన్‌తో పోలిస్తే ఈ ఐఫోన్‌ను చాలా అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్లతో తీసుకువస్తున్నారు. కంపెనీ సరసమైన విభాగంలో AI ఫీచర్లను కూడా అందించగలదు.

ALSO READ  Cheapest Recharge Plans: Jio, Airtel కిక్కిచ్చే ప్లాన్స్.. భారీగా తగ్గిన రీఛార్జ్ ధరలు..!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *