Viral Video: ఒకప్పుడు ప్రజలు నీటి అవసరాల కోసం నదులు, సరస్సులపై ఆధారపడి స్నానాలకు అక్కడికి వెళ్లేవారు. అయితే, ఇప్పుడు పరిస్థితి అలా కాదు; ప్రజలు ఇప్పుడు తమ ఇళ్లలోని బాత్రూమ్‌లకే పరిమితమయ్యారు. అయితే, కొంతమందిలో ఈ అభిరుచి ఇప్పటికీ సజీవంగా ఉంది అలాంటి వారికి అవకాశం దొరికినప్పుడల్లా, వారు నదిలోకి దిగి తమ అభిరుచిని నెరవేర్చుకుంటారు. అలాంటి ఒక వ్యక్తి వీడియో ఈ రోజుల్లో వెలుగులోకి వచ్చింది.
స్నానం చేస్తుండగా కాళ్లకు ఏదో తగిలింది. మొదట రాయిలా అనిపించినా, అది కదులుతుండటంతో అతనికి అనుమానం వచ్చింది. వెంటనే చేత్తో పైకి తీసి చూసాడు. ఒక్కసారిగా షాక్‌కు గురైన అతను, దాన్ని భయంతో అవతలికి విసిరేసి, ఒక్కసారిగా పడవపైకి ఎగబాకాడు.
View this post on Instagram
వాస్తవానికి అతని కాళ్లకు తగిలిందేమిటంటే… ఒక మొసలి! నోరు తెరిచి ఉన్న దాన్ని చూసిన అతను ఒక్కసారిగా భయంతో వెనక్కి వెళ్లిపోయాడు. ముప్పు త్రుటిలో తప్పించుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. “అతను తృటిలో చావునుంచి తప్పించుకున్నాడు” అని కొందరు కామెంట్ చేయగా, మరికొందరు “యమధర్మరాజు లీవ్‌లో ఉన్నట్టున్నారు!” అంటూ సరదాగా రియాక్ట్ అవుతున్నారు. ఈ వీడియో ఇప్పటివరకు 3.8 మిలియన్ల మంది వీక్షించగా, 89 వేల మంది లైక్ చేశారు.