CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో జరిగిన సంఘటనలో తృటిలో ప్రమాదం తప్పింది. సీఎల్పీ (CLP) సమావేశం కోసం సీఎం రేవంత్ రెడ్డి నోవాటెల్ హోటల్‌కి వెళ్లారు. 8 మంది ఎక్కాల్సిన లిఫ్ట్‌లో రేవంత్ రెడ్డితోపాటు 13 మంది ఎక్కారు. దీంతో లిఫ్ట్ ఓవర్‌లోడ్ అయింది. ఆ బరువుతో లిఫ్ట్ కాస్త కిందికి జారిపోయింది. కొన్ని క్షణాల పాటు అందరూ భయపడిపోయారు. ఏం జరుగుతోందో అర్థం కాలేదు.
Also Read: Hyderabad: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం
CM Revanth Reddy: అలారం మోగగానే హోటల్ సిబ్బంది, భద్రతా అధికారులు అప్రమత్తం అయ్యారు. వెంటనే వచ్చి లిఫ్ట్ డోర్ తెరచి అందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని మరో లిఫ్ట్‌లో సమావేశం జరిగే రెండవ అంతస్తుకు తీసుకెళ్లారు. ఎవరికి ఏమి కాలేదు. పెద్ద ప్రమాదం జరగలేదు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.