Beer: మితంగా బీర్ తాగడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కానీ అతిగా తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే బీర్ తాగేవారు దాని ప్రయోజనాలు అప్రయోజనాలు గురించి తెలుసుకోవాలి. ఒక వారంలో ఎంత బీర్ తాగవచ్చో తెలుసుకుందాం.
నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) నివేదిక ప్రకారం, పురుషులు, మహిళలు వారానికి 14 యూనిట్ల కంటే ఎక్కువ మద్యం తాగకూడదు. ఇక్కడ యూనిట్ 10 మిల్లీలీటర్లు లేదా 8 గ్రాముల స్వచ్ఛమైన ఆల్కహాల్. ఉదాహరణకు 568 ml లీటర్ సాధారణ బీర్ క్యాన్‌లో 5% ఆల్కహాల్ ఉంటుంది. ఇందులో దాదాపు 3 యూనిట్ల ఆల్కహాల్ ఉంటుంది.
Beer: అంటే మీరు ఒక వారంలో 6 క్యాన్ల సాధారణ బీర్ తాగితే మీరు 14 యూనిట్ల పరిమితిలో ఉంటారు. అంతకు మించి తాగవద్దు అంటున్నారు నిపుణులు. బీర్‌లోని హెచ్‌డిఎల్ లేదా మంచి కొలెస్ట్రాల్ గుండెకు మంచిది. ఈ ఆల్కహాలిక్ డ్రింక్‌లో చిన్న మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అవి ఎముకలను దృఢపరుస్తాయి. ఫలితంగా బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, పరిమితికి మించి బీర్ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మీరు ఎక్కువగా బీర్ తాగితే, మీ శరీరం నీటిని కోల్పోతుంది. ఇది తలనొప్పి, నోరు పొడిబారడం డీహైడ్రేషన్ వల్ల నీరసం వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది.