Vishwambhara

Vishwambhara: విశ్వంభర: రిలీజ్ విషయంలో నో క్లారిటీ!

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్‌గా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తోన్న భారీ చిత్రం విశ్వంభర గురించి అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, చాలా కాలం తర్వాత విడుదలైన ఫస్ట్ సింగిల్ రామ రామ సూపర్ హిట్‌గా నిలిచింది.

వింటేజ్ వైబ్స్‌తో కూడిన ఈ పాట సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ సాంగ్‌తోనే రిలీజ్ డేట్ వస్తుందని మెగా ఫ్యాన్స్ భావించారు, కానీ మేకర్స్ ఆ విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అభిమానులు రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం.

Also Read: Hit 3 Trailer: ‘హిట్ 3’ ట్రైలర్ కి రికార్డ్ బ్రేకింగ్ రెస్పాన్స్!

Vishwambhara: కీరవాణి సంగీతం అందిస్తుండగా, యూవీ క్రియేషన్స్ నిర్మాణ బాధ్యతలు స్వీకరించింది. విశ్వంభర ఓ విజువల్ వండర్‌గా రూపొందుతోందని, చిరంజీవి మరోసారి తన స్టార్‌డమ్‌తో అదరగొట్టనున్నారని అభిమానులు ధీమాగా ఉన్నారు. మరి, రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఎప్పుడు వస్తుంది? మేకర్స్ ఈ సస్పెన్స్‌ను ఎప్పుడు బ్రేక్ చేస్తారో చూడాలి!

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  GN Saibaba: మహా న్యూస్ తో సాయిబాబా చివరి ఇంటర్వ్యూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *