OG: అమెరికా బాక్సాఫీస్‌లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా దూసుకెళ్తోంది. తక్కువ షోలతో బుకింగ్‌లు ఓపెన్ అయినప్పటికీ, డిమాండ్ ఊహించనంతగా పెరిగింది. ‘దేవర’, ‘పుష్ప 2’ వంటి భారీ చిత్రాలను వెనక్కి నెట్టి యూఎస్‌లో టాప్ స్థానాన్ని కైవసం చేసుకుంది. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ప్రీ-సేల్స్‌లోనే రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడవుతున్నాయి. సుజిత్ డైరెక్షన్, పవన్ యాక్టింగ్, డి.వి.వి ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడం పక్కా అట. అందుకు తగ్గట్టే ప్రస్తుతం యూఎస్‌లో ఈ సినిమా బుకింగ్స్ ట్రెండ్ ఇండియన్ సినిమా చరిత్రలో కొత్త రికార్డ్‌ను సృష్టిస్తోంది