venkatesh

Venkatesh: సంక్రాంతి…’ కోసం ‘నేను పాడతా’ అంటున్న వెంకటేశ్‌!

Venkatesh: విక్టరీ వెంకటేశ్‌ తో దిల్ రాజు నిర్మిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ జనవరి 14న విడుదల కాబోతోంది. అయితే… ఈ సినిమా ప్రమోషన్స్ ను దర్శకుడు అనిల్ రావిపూడి ఓ లెవెల్ లో చేస్తున్నారు. తాజాగా థర్డ్ సింగిల్ కు సంబంధించిన ఓ ఎగ్జయిటింగ్ న్యూస్ ను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాని ప్రకారం ‘సంక్రాంతికి వస్తున్నాం’ థర్డ్ సింగిల్ ను వెంకటేశ్‌ తో పాడించారు. అయితే… ఈ పాట బాగా నచ్చేసి… వెంకటేశే స్వయంగా తాను పాడతానని అనిల్ రావిపూడిని హింసించినట్టుగా ఈ వీడియోను రూపొందించారు. మొత్తానికీ ఈ మూవీ ప్రమోషన్స్ లో అనిల్ రావిపూడి తన మార్క్ ను బాగా చూపిస్తున్నారు.

అల్లు అర్జున్‌పై అమితాబ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Amitabh Bachchan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై బాలీవుడ్‌ అగ్ర నటుడు, బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పుష్ప 2 సినిమా జాతీయ స్థాయిలో రికార్డుల‌ వ‌ర్షం కురుస్తుండ‌గా అమితాబ్ వ్యాఖ్య‌లు ఆస‌క్తిని రేపుతున్నాయి. ఈ సినిమాతో సినీ జ‌న‌మంతా పుష్ప 2 మ్యానియాలో మునిగి తేలుతుండ‌గా, రోజురోజుకూ సినిమాకు క‌న‌క‌వ‌ర్షం కురుస్తున్న‌ది. ఇప్ప‌టికే ప‌లు విష‌యాల్లో పుష్ప 2 సినిమా రికార్డుల‌ను క్రియేట్ చేసింది. అయితే ఆ సినిమా హీరో అల్లు అర్జున్ మాత్రం సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌తో ఆందోళ‌న‌లోనే ఉన్నారు.

Amitabh Bachchan: పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్‌కు అంత‌ర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు వ‌చ్చింది. అలాంటి అల్లు అర్జున్‌పై బాలీవుడ్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ప్ర‌శంస‌లు కురిపించారు. బ‌న్నీ గొప్ప ప్ర‌తిభావంతుడ‌ని బిగ్ బీ కొనియాడారు. కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి కార్య‌క్ర‌మంలో ఓ కంటెస్టెంట్‌తో అల్లు అర్జున్ గురించి బిగ్ బీ మాట్లాడ‌టం విశేషం. మెలిగిన వార్త ఇక్కడ చదవండి: Amitabh Bachchan: అల్లు అర్జున్‌పై అమితాబ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Allu Arjun: ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *