Health Tips: మనం తినే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఒక్కో రకమైన ఆహారం శరీరంలో ఒక్కో భాగానికి మేలు చేస్తుంది. శరీరంలో ఏ భాగానికి ఏ ఆహారం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
కాలేయ ఆరోగ్యానికి
పసుపు కాలేయానికి మంచిది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కాలేయం ఆరోగ్యాన్ని కాపాడతాయి. బీట్‌రూట్, క్యారెట్ కూడా కాలేయానికి మేలు చేస్తాయి.
చర్మ కోసం
మెరిసే చర్మం కోసం యాపిల్స్ తినాలి. బీట్‌రూట్, క్యారెట్ కూడా మంచిది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.
మూత్రపిండాలు
కిడ్నీ ఆరోగ్యానికి కీరదోసకాయ మంచిది. ఇందులో ఉండే నీటి శాతం కిడ్నీలకు మేలు చేస్తుంది. నిమ్మరసం మూత్రపిండాలను శుభ్రపరచడంలో కూడా సహాయపడుతుంది.
జీర్ణక్రియ కోసం
దోసకాయ, గ్రీన్ యాపిల్, అలోవెరా జీర్ణక్రియకు మేలు చేస్తాయి.
ఊపిరితిత్తులకు
ఊపిరితిత్తుల ఆరోగ్యానికి అల్లం మంచిది. అల్లంలోని ఔషధ గుణాలు ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి. వెల్లుల్లి, పైనాపిల్ కూడా మంచివి.
రక్త శుద్దీకరణ
రక్తశుద్ధికి దానిమ్మ మంచిది. నారింజ, అల్లం కూడా రక్త శుద్ధిలో సహాయపడతాయి.