Vijaya Sai Reddy: అధికారం శాశ్వతం అనుకున్నారో ఏమో.. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన అక్రమాలకూ అంతూ దరీ లేకుండా పోయింది. ఒక కేసు గురించి మాట్లాడుకునే లోపులోనే మరో ఆరోపణ.. దానిమీద దర్యాప్తు మొదలు పెట్టే లోపు మరో సంచలనం. ప్రస్తుత పరిస్థితి ఇది. తాజాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో అంతా తానై చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి చేసిన నిర్వాకం వెలుగులోకి వచ్చింది. అప్పట్లో చంద్రబాబు నాయుడు పై ఫైబర్ నెట్ విషయంలో ఎన్నో అవకతవకలు ఉన్నాయంటూ కేసు నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు నాయుడు ఏ1 గా పేర్కొన్నారు. కోట్లాది రూపాయల అవినీతి జరిగింది అంటూ ఆరోపణలు చేశారు.
Vijaya Sai Reddy: ఇప్పుడు ఈ కేసు కొత్త మలుపు తీసుకుంది. చంద్రబాబు నాయుడును ఇరికించడం కోసం అప్పట్లో విజయసాయిరెడ్డి ఫైబర్ నెట్ లోకి తన మనుషులను అక్రమంగా ప్రవేశ పెట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. విచిత్రంగా ఈ ఆరోపణల్లో లింకులు అప్పట్లో విజయసాయిరెడ్డి పై మదన్ మోహన్ అనే వ్యక్తి చేసిన ఆరోపణలతో లింక్ అయి ఉన్నాయి. విషయం ఏమిటంటే.. ఎవరైతే శాంతి అనే మహిళా అధికారి(?) భర్త మదన్ మోహన్ తన భార్య తో విజయసాయిరెడ్డికి సంబంధాలు ఉన్నాయి అని ఆరోపించారో.. అదే శాంతి చెల్లెళ్లు ఇద్దరిని ఏపీ ఫైబర్ నెట్ లో ఉద్యోగులుగా విజయసాయిరెడ్డి ఆదేశాలతో నియమించారు. ఇప్పుడు ఈ విషయాన్ని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి బయట పెట్టారు. ఏపీ ఫైబర్ నెట్ లో శాంతి చెల్లెళ్లు ప్రియాంక, ప్రియదర్శిని లను కీలక పోస్టులలో గత ప్రభుత్వ హయాంలో నియమించచారని ఆయన తెలిపారు. అయితే, ఈ నియామకాలకు కనీసం అపాయింట్ మెంట్ ఆర్డర్ కూడా లేదని చెప్పారు. వారిద్దరితో అప్పట్లో చంద్రబాబు నాయుడుపై కేసు ఫైల్ చేయడం కోసం ఏపీ ఫైబర్ నెట్ కి సంబంధించిన కీలక పత్రాలను మాయం చేయడం లేదా మాడిఫై చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు.
Vijaya Sai Reddy: ఈ మొత్తం వ్యవహారంలో విజయసాయిరెడ్డి వైపే అన్ని దారులు వెళుతున్నాయి. కేవలం చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయించాలనే కసితోనే విజయసాయిరెడ్డి పెద్ద స్కెచ్ వేసినట్టు అర్ధం అవుతోంది. అటు శాంతి ఉద్యోగం విషయంలో కూడా అనేక ఆరోపణలు విజయసాయిరెడ్డి మీద అప్పట్లో వచ్చాయి. తాజాగా ఆమె చెల్లెళ్లను కూడా కీలకమైన ప్రాంతాల్లో నియమించి.. వారి ద్వారా ఏకంగా ఫైళ్లను తారుమారు చేసే పనులే చేశారనే విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ఒకవిధంగా ఆలోచిస్తే ఒకటి రెండు కేసులు.. ఆరోపణలు అయితే విచారణ జరిపించడానికి ప్రభుత్వానికి సాధ్యం అవుతుంది. మరి ఒకదాని మీద ఒకటిగా బయటపడుతున్న అక్రమాలు.. ఆరోపణల నేపథ్యంలో ఏమి జరుగుతుంది.. ప్రభుత్వం ఏమి చేస్తుంది అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది.
Vijaya Sai Reddy: కొసమెరుపు ఏమిటంటే శాంతి భర్త మదన్ మోహన్ ఇటీవల మంత్రి లోకేష్ బాబును కలిసి తన భార్య రెండేళ్లలో 20 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు కూడబెట్టిందనీ.. నెలకు లక్ష రూపాయల జీతంతో పనిచేసే ఆమె రెండేళ్లలో ఇంత ఆస్తులను ఎలా కూడబెట్టిందో విచారణ జరిపించాలని కోరారు.