Cucumber For Beauty: కీరదోసకాయ ఆరోగ్యానికే కాదు చర్మాన్ని సంరక్షించడానికి కూడా ఉపయోగపడుతుంది. దోసకాయలో యాంటీ ఆక్సిడెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి.. ఇవి ముఖం ముడుతలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా, దృఢంగా మార్చడంలో సహాయపడుతుంది. చర్మాన్ని కాపాడుకోవడానికి దోసకాయను ఉపయోగించవచ్చు.
ముడతలు లేకుండా యవ్వనంగా కనిపించాలంటే..
- దోసకాయ రసాన్ని చర్మానికి పట్టించి పదిహేను నిమిషాల పాటు ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు రోజులు చేయండి. ఇది ముఖంలోని నలుపును పోగొట్టడానికి సహాయపడుతుంది.
- చర్మం ఆరోగ్యంగా ఉండటానికి తేమ ఎల్లప్పుడూ ముఖ్యం. రెండు చెంచాల దోసకాయ పేస్ట్, కొన్ని అలోవెరా జెల్ మిక్స్ చేసి మీ ముఖం, మెడకు అప్లై చేయాలి. ఇది ముఖంలోని నలుపును పోగొట్టడానికి సహాయపడుతుంది.
- ఒక టీస్పూన్ ఓట్స్ పొ, రెండు టీస్పూన్ల దోసకాయ రసం కలపాలి. మీ ముఖం, మెడకు 15 నిమిషాల పాటు అప్లై చేయాలి. తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.
- దోసకాయను చిన్న ముక్కలుగా కోసి కళ్ల కింద కాసేపు ఉంచితే నల్లటి వలయాలు పోతాయి.