Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం తప్పింది. సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. నియోజకవర్గ కేంద్రమైన హుజూర్నగర్ నుంచి జాన్‌పహాడ్‌లో జరిగే ఉర్సు ఉత్సవాలకు బయలుదేరి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయనకు ఎలాంటి హాని జరగకలేదు.
Uttam Kumar Reddy: సూర్యాపేట జిల్లాలోని గరిడేపల్లి మండల కేంద్రంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ రోడ్డుపై ఒక్కసారిగా ఆగడంతో వెనుక నుంచి వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. మరో 5 వాహనాలు ముందు భాగాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. కానీ, ఈ ప్రమాదంలో మంత్రి ఉత్తమ్‌కు ఎటువంటి హాని జరగలేదు. దీంతో భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

