Urvashi Rautela

Urvashi Rautela: దబిడి దిబిడి స్టెప్పులపై ఊర్వశి షాకింగ్ కామెంట్స్..!

Urvashi Rautela: బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో ‘దబిడి దిబిడి’ అనే మాస్ సాంగ్ ఉంది. అయితే, ఈ సాంగ్‌లోని స్టెప్స్‌పై ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగింది. బాలయ్య, ఊర్వశి తో చేసిన ఈ స్టెప్పులు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. తాజాగా ఈ కామెంట్స్‌పై ఊర్వశి రౌటేలా రియాక్ట్ అయ్యింది. ఈ సాంగ్ లో తనకేమి అభ్యంతరకరమైన స్టెప్స్ ఉన్నట్లు అనిపించలేదని.. తాను ఈ పాటను ముందుగా రిహార్సల్ చేశానని.. శేఖర్ మాస్టర్‌తో తాను ఇంతకు ముందు కూడా వర్క్ చేశానని ఆమె చెప్పుకొచ్చింది. ఈ పాటలోని స్టెప్పులపై నెగెటివ్ కామెంట్స్ రావడం చూసి తాను షాక్ అయ్యానని ఊర్వశి తెలిపింది. ప్రస్తుతం ఈమె కామెంట్స్ నెటిజెన్స్ ని షాక్ కి గురి చేస్తున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Rajeev Khandelwal: ఛత్రపతి శివాజీ వారసత్వంపై వెబ్ సీరీస్!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *