Guava Leaves: జామ పండు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే జామ ఆకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. అవును జామ ఆకులు కూడా చాలా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండిన ఇవి శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్యంలో భాగంగా ఉన్నాయి. దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయం అవుతాయి. జామ ఆకులను నమలడం ద్వారా ఎలాంటి సమస్యలను నివారించవచ్చు అనేది తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: Sabarimala: శబరిమలకు పోటెత్తిన భక్తజనం
Guava Leaves: జామ ఆకులను తినడం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఇందులోని ఫినాలిక్ కంటెంట్ యాంటీ హైపర్ గ్లైసెమిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు జామ ఆకులను నమలడం చాలా మంచిది.జామ ఆకులను తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.ఇందులో పొటాషియం, ఫైబర్ కలిగి ఉంటాయి. ఇవి బీపీని తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి బీపీ ఉన్నవారు జామ ఫ్రూట్ లేదా ఆకులను నమిలితే మంచి ఫలితాలు వస్తాయి.
ఇది కూడా చదవండి: KITCHEN TIPS: చపాతీ మెత్తని పూరీలా ఉబ్బిపోవాలా? ఇలా చేయండి
Guava Leaves: జామ ఆకులలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, అధిక ఫైబర్ కంటెంట్ ఉన్నాయి. . మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. మొత్తం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జామ ఆకులు చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచుతాయి, తద్వారా హృదయ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Guava Leaves: బరువు తగ్గడానికి జామ ఆకులు ప్రభావవంతంగా ఉంటాయి. ఈ ఆకులను తింటే లేదా ఆకులతో చేసిన డికాషన్ తాగితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. అలాగే లీఫ్ డికాక్షన్ శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది. దీని వల్ల బరువు కూడా తగ్గి శరీరం ఫిట్ గా కనిపిస్తుంది.జామ ఆకులలో చాలా ఫైబర్ ఉన్నందున, వాటిని ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా డయేరియా వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. జామ ఆకులు కొందరిలో అలర్జీని కలిగిస్తాయి. ఇది వాపు లేదా దురదకు కారణం కావచ్చు