Bottle Gourd: సొరకాయ మనిషి ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. మలబద్ధకం సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. సొరకాయలో విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో ఉండే పోషకాలు మరే ఇతర కూరగాయల్లో లేవు. అయితే, కొన్ని ఆహార పదార్థాలను సొరకాయతో కలిపి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. సొరకాయతో మీరు తినకూడని 5 ఆహారాలు ఎంటో తెలుసుకుందాం.
సొరకాయ విత్ కాలీఫ్లవర్: ఈ రెండింటినీ కలిపి తినడం మానుకోండి. ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది.
సొరకాయ విత్ కాకరకాయ: ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ వస్తుంది. కాబట్టి, దీన్ని నివారించండి.
Also Read: Coriander Benefits: కొత్తిమీర గింజల నీళ్లతో అద్భుతమైన ప్రయోజనాలు
సొరకాయ విత్ పాలు: ఆయుర్వేదం ప్రకారం, ఈ రెండింటినీ కలిపి తినకూడదని చెబుతారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
సొరకాయ విత్ పాలు నిమ్మరసం: ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. అలెర్జీ సంభవించవచ్చు. తెల్లటి మచ్చలు, దురద వంటి సమస్యలు రావచ్చు.
సొరకాయ విత్ బీట్‌రూట్: ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల ముఖం, శరీరంపై దద్దుర్లు వస్తాయి.
సొరకాయ జ్యూస్ తాగితే జీవక్రియ, రోగనిరోధక శక్తి పెరుగుతాయి. బరువు తగ్గడానికి, చర్మానికి కూడా మంచిది.